Kiran Abbavram : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యాడు. ఆయన భార్య రహస్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అందుకు సంబందించిన విషయాన్ని సోషల్ మీడియాలో హీరో కిరణ్ అబ్బవరం షేర్ చేశారు. అంతేకాదు తన కొడుకు పాదాలను ముద్దు పెడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. రహస్య గోరఖ్ కొద్ది గంటల ముందే ప్రసవించింది. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.. నాకెంతో ఇష్టమైన దేవుడు హనుమంతుడు.. ఆయన జయంతి రోజునే మా ఇంట కొడుకు జన్మించడం చాలా అదృష్టం. స్వయంగా ఆంజనేయుడే మా ఇంటికి వచ్చినట్టు ఉంది అంటూ పోస్టులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది..
కిరణ్ అబ్బవరం, రహస్య ఇద్దరు కలిసి సినిమా చేశారు. రాజా వారు రాణి గారు తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి పీటల వరకు వెళ్లారు.. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాదిలోనే ఇరువురు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం రహస్య నటనకు దూరంగా ఉండగా, కిరణ్ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నాడు. భార్య రహస్య బేబీ బంప్ ఫొటోలను కూడా కిరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ఆ పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు బిడ్డ కు జన్మ నిచ్చిన ఫోటోలను షేర్ చెయ్యడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు..
Also Read: నితిన్ తమ్ముడుకు అడ్డంకి..టైం చూసి దెబ్బ కొట్టారుగా..
కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికొస్తే..
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి యంగ్ హీరోగా అడుగు పెట్టిన ఈ హీరో గతంలో ఒకటి, రెండు చిత్రాలతో మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 2024లో ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం, ఆ తర్వాత ‘దిల్‌రూబ’ సినిమా రిలీజ్ చేశాడు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ‘క’ మూవీకి సీక్వెల్‌గా ‘K-Ramp’ అనే మూవీ అనౌన్స్ చేశాడు కిరణ్ అబ్బవరం.. ఐశ్వర్యా గోరక్ పేరుతో తెరంగ్రేటం చేసిన రహస్య గోరక్, 2012 లో మంచు విష్ణుతో కలిసి ‘దేనికైనా రెడీ’ సినిమాలో నటించింది.. ఆ తర్వాత మరో సినిమాలో నటించింది. కానీ ఏ ఒక్కటి హిట్ టాక్ ను అందివ్వలేదు. దాంతో సినిమాలను పక్కన పెట్టేసింది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరంతో ప్రేమలో పడింది.. ఇప్పుడు ఏడాది తిరక్కుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. కిరణ్ అబ్భావరం మాత్రం వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు.
Blessed with a Baby Boy 😇
Happy Hanuman Jayanthi 🙏#Jaisreeram pic.twitter.com/UG5Ztky8gd
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) May 22, 2025