BigTV English

KA11: కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. ఘనంగా పూజా కార్యక్రమాలు మొదలు..!

KA11: కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. ఘనంగా పూజా కార్యక్రమాలు మొదలు..!

KA11:ప్రముఖ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే చివరిగా ‘క’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈయన.. భారీ కలెక్షన్లు అందుకుంటూ దూసుకుపోయారు. క సినిమాతో ఏకంగా 60 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ సినిమా తర్వాత ‘దిల్ రూబా’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాంబోతోంది.


K – ర్యాంప్ పూజా కార్యక్రమాలు పూర్తి..

ఇక అంతలోనే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ K – ర్యాంప్ ‘ అనే టైటిల్ తో ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టుకి ఓకే చెప్పారు కిరణ్ అబ్బవరం. ఈ నేపథ్యంలోనే.. రామానాయుడు స్టూడియోలో ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు..ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dilraju ) హీరో హీరోయిన్ పై క్లాప్ కొట్టగా.. చిత్ర బృందం చప్పట్లతో హోరెత్తించారు. అలాగే నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకులు విజయ్ కనకమేడల, యదు వంశీ, రామ్ అబ్బరాజు స్క్రిప్టును అందించారు. తొలి షార్ట్ కి యోగి దర్శకత్వం వహించారు.. ఇక ఈ చిత్రంలో రంగబలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ పూజ కార్యక్రమాల్లో భాగంగా.. టైటిల్ పోస్టర్ రివీల్ చేస్తూ .. ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఒక వేషధారణ మనకు కనిపిస్తోంది. పైగా ఒక మందు బాటిల్ కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ స్టోరీకి ఏదో లింకు ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక మొత్తానికి అయితే ‘K- ర్యాంప్’ అంటూ కిరణ్ అబ్బవరం ఈసారి యూత్ ఆడియన్స్ను మెప్పించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్ లో ఏడవ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత రాజేష్ దండా.. కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


త్వరలో దిల్ రూబా విడుదల..

ఇకపోతే కిరణ్ అబ్బవరం 10వ సినిమాగా వస్తున్న దిల్ రూబా సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కాబోతోంది .ఈ చిత్రాన్ని శివం సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారేగామా నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిమ్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు . ఈ చిత్రం ద్వారా విశ్వకరుణ్ అనే ఒక యువ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

పాజిటివిటీతో దూసుకుపోతున్న కిరణ్.

ప్రస్తుతం ఫుల్ పాజిటివిటీతో దూసుకుపోతున్నారు కిరణ్ అబ్బవరం..అందులో భాగంగానే ప్రముఖ నటి రహస్య ఘోరక్ తో పెళ్లి ,అంతలోనే క మూవీతో హిట్టు కొట్టడం, మరొకవైపు ఆయన భార్య రహస్య గర్భవతి కావడం, అన్నీ కూడా కిరణ్ అబ్బవరం కు బాగా కలిసి వస్తున్నాయి.ఇక వచ్చేవారం దిల్ రూబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×