Kannappa : మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ (Kannappa). బడ్జెట్ మాత్రమే కాదు ఈ సినిమాలో నటిస్తున్న తారాగణం కూడా భారీగానే ఉంది. అయితే ఇప్పటి దాకా ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పోస్టర్ను వదులుతూ, సినిమాలో నటిస్తున్న నటీనటుల క్యారెక్టర్లను రివీల్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే చివరగా ప్రభాస్ రోల్ ను పరిచయం చేశారు. ఈ మేరకు తాజాగా రుద్రగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ని వదిలారు. కానీ ఆ ఫస్ట్ లుక్ ని చూశాక డార్లింగ్ (Prabhas) అభిమానులు మంచు విష్ణు (Manchu Vishnu) పై ఫైర్ అవుతున్నారు.
రుద్రగా ప్రభాస్ ఫస్ట్ లుక్
ప్రభాస్ (Prabhas) ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో భాగమవుతున్నాడు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి, ఆయన ఈ మూవీలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నారు? లుక్ ఎలా ఉండబోతోంది? అని ఆతృత పెరిగిపోయింది. ఆ ఉత్కంఠతను మరింతగా పెంచుతూ, ఇప్పటిదాకా ప్రభాస్ ఫస్ట్ లుక్ ను సస్పెన్స్ లో పెట్టారు. అంతలోగా ప్రభాస్ లుక్ ‘కన్నప్ప’ సెట్స్ నుంచి లీక్ కావడం, ఆ లీక్ చేసిన వాళ్ళను పట్టిస్తే నజరానా ఇస్తామంటూ టీం ప్రకటించడం జరిగిపోయింది.
మరోవైపు ప్రభాస్ అభిమానులకు ఈ సినిమాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ రోల్ ఉండబోతుందని హామీ ఇస్తూ వచ్చారు మంచు విష్ణు (Manchu Vihsnu). దీంతో సినిమా కంటే ఎక్కువగా ప్రభాస్ లుక్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం ‘రుద్ర’ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు అంటూ ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కానీ ఇప్పటిదాకా ప్రభాస్ లుక్ కోసం వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణ, ఒక్కసారిగా రుద్ర ఫస్ట్ లుక్ చూడగానే నీరుగారిపోయింది.
రుద్ర ఫస్ట్ లుక్ పై డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్
నిజానికి మంచు విష్ణు (Manchu Vishnu) ఇన్నాళ్లు ప్రభాస్ (Prabhas) లుక్ గురించి ఇచ్చిన హైప్ తో, ఫస్ట్ లుక్ పవర్ ఫుల్ గా ఉంటుందని ఆశించారు. కానీ తీరా చూస్తే “ప్రళయకాల రుద్రుడు… త్రికాల మార్గదర్శకుడు… శివాజ్ఞ పరిపాలకుడు రుద్ర” అంటూ ఆయన కూల్ గా ఉన్న లుక్ ని రిలీజ్ చేశారు. టీజర్ లో, రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్లో ప్రభాస్ ను పవర్ ఫుల్ గా చూడబోతున్నామని హోప్ ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన రుద్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే కనీసం గ్రాఫిక్స్ కూడా సరిగ్గా చేసినట్టుగా అనిపించట్లేదు అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఆ కర్రను పట్టుకున్న విధానం దగ్గర విఎఫ్ఎక్స్ వర్క్ సరిగ్గా లేదంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అలా టీజర్ లో మైనస్ పాయింట్స్ ను హైలెట్ చేస్తూ, 200 కోట్లు గ్రాఫిక్స్ కోసం సరిపోలేదా మంచు భయ్యా? రుద్ర ఫస్ట్ లుక్ ఇంత నాసిరకంగానా? అంటూ ఏకిపారేస్తున్నారు.