BigTV English

Chiranjeevi : చిరంజీవికి గట్టి కౌంటర్ వేసిన కిరణ్ బేడీ… ఇకనైనా కళ్ళు తెరవండి అంటూ ఘాటు పోస్ట్

Chiranjeevi : చిరంజీవికి గట్టి కౌంటర్ వేసిన కిరణ్ బేడీ… ఇకనైనా కళ్ళు తెరవండి అంటూ ఘాటు పోస్ట్

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వారసత్వం గురించి చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలో విమర్శలను రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ‘బ్రహ్మ ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చిరంజీవి ఈ కామెంట్స్ చేశారు. ఇన్ని రోజుల తర్వాత ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న కిరణ్ బేడీ (Kiran Bedi) మెగాస్టార్ చిరంజీవి వారసత్వం వ్యాఖ్యలపై చురకలు అంటించింది. మేలుకోవాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.


చిరంజీవిపై కిరణ్ బేడీ ఫైర్

భారతదేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా, ఉక్కు మహిళగా అందరి ప్రశంసలు అందుకున్న కిరణ్ బేడీ, పోలీస్ శాఖలో ఎన్నో విజయాలను సాధించింది. సమాజ శ్రేయస్సు కోసం ఆమె చేసిన కృషికి గాను అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను అందుకున్నారు. 2007లో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ గా పని చేస్తూ ఆమె స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత 2015లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన ఆవిడ గెలవలేదు. 2021 ఫిబ్రవరి 16న పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ పదవికి ఆవిడ రాజీనామా చేశారు.


అయితే తాజాగా అంతర్జాతీయ మీడియాలో చిరంజీవి కామెంట్స్ పై వచ్చిన వార్తల స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ చిరుపై ఆవిడ ఫైర్ అయ్యారు. “చిరంజీవి జీ… దయచేసి కూతురు కూడా ఒక వారసత్వమేనని నమ్మడం, గ్రహించడం ఇకనైనా స్టార్ట్ చేయండి. ఇదంతా మీరు కూతుర్ని ఎలా పెంచుతారు ? ఆమె ఎలా డెవలప్ అవుతుంది ? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే తమ కూతుర్లను పెంచి, వారికంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసిన తల్లిదండ్రులను చూసి నేర్చుకోండి. వాళ్లు తమ కుటుంబాలను గర్వపడేలా చేశారు. ఆడా, మగా అని తేడా లేకుండా సమానంగా బ్రతికేలా చేశారు” అంటూ ఆమె చేసిన ఘాటు పోస్ట్ వైరల్ అవుతుంది.

చిరంజీవి ఏమన్నారంటే?

‘బ్రహ్మా ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. చిరు ఓ సందర్భంలో ఇంట్లో ఉన్నప్పుడల్లా తనకు మనవరాళ్లతో ఉన్నట్టుగా అనిపించదని, ఏదో లేడీస్ హాస్టల్ లో ఉన్నట్టుగా ఉంటుందని ఫన్నీగా కామెంట్ చేశారు. అంతేకాకుండా “చరణ్ కు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. క్లీంకారా అంటే అతనికి ప్రాణం. అందుకే మరో అమ్మాయిని కంటాడేమోనని భయం. కానీ నేను మా వారసత్వాన్ని కొనసాగించడానికి ఈసారి అబ్బాయిని కనమని సలహా ఇచ్చాను” అని చెప్పుకొచ్చారు. దీంతో వారసత్వం కోసం అబ్బాయిని కనాలని మెగాస్టార్ రేంజ్ స్టార్ కామెంట్స్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ కాలంలో కూడా మగ పిల్లలు మాత్రమే వారసులు అని చిరంజీవి స్థాయి వ్యక్తులు అనడం కరెక్ట్ కాదని, అంటే అమ్మాయిలు వారసులు కారా ? అంటూ తెగ విమర్శించారు. అంతేకాదు జాతీయ స్థాయిలోను చిరంజీవిపై విమర్శలు గుప్పించాయి. చిరంజీవి సరదాగా చేసిన ఆ కామెంట్స్ ఆయనను వివాదంలోకి నెట్టాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×