Chiranjeevi:మెగాస్టార్ హీరోగా నటించిన విశ్వంభర (Vishwambhara) మూవీ సంక్రాంతికి వస్తుందని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. కానీ సడన్ గా కొడుకు కోసం సంక్రాంతిని త్యాగం చేశారు చిరు. దాంతో విశ్వంభర సినిమా షూటింగ్ చాలా లేట్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది.అయితే ఇప్పటికే విశ్వంభర మూవీ డైరెక్టర్ వశిష్ట(Vassistha)కి చిరంజీవికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, విజువల్స్ బాగా లేకపోవడంతో వశిష్టపై చిరంజీవి ఫైర్ అయ్యారని వార్తలు కూడా వినిపించాయి.అలాగే షూటింగ్ కూడా చాలా లేటుగా చేయడంతో చిరంజీవి వేరే సినిమాలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విశ్వంభర మూవీ రిలీజ్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే, చిరంజీవి విశ్వంభర మూవీ ని ఆ స్పెషల్ డే న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆ స్పెషల్ డే న విడుదల చేస్తే చిరంజీవికి సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది అంటూ ఓ టాక్ వినిపిస్తోంది.మరి ఇంతకీ విశ్వంభర రిలీజ్ ఎప్పుడు ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..
Devara 2 : వార్ 2 ఎఫెక్ట్… దేవర 2 లో బాలీవుడ్ స్టార్ హీరో…?
విశ్వంభర రిలీజ్ ఆ రోజే..
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన విశ్వంభర రిలీజ్ విషయంలో మేకర్స్ కాస్త మందకొడిగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పడికే పూర్తి షూటింగ్ కంప్లీట్ అయినప్పటికి ఇంకా 2పాటల షూటింగ్ మిగిలి ఉందట. అలాగే ఈ సినిమా మార్చ్ లేదా ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు విశ్వంభర చిత్ర యూనిట్ ప్రవర్తించే తీరు చూస్తే మాత్రం సమ్మర్ హాలిడేస్ లో కూడా ఈ సినిమా విడుదలయ్యేలా లేదు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ పై ఒక రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీని చిరు బర్త్డే రోజు అనగా ఆగస్టు 22న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టు సమాచారం.అయితే ఇప్పటికే చిరంజీవి నటించిన చాలా సినిమాలు ఆయన బర్త్డే సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ సెంటిమెంట్ ఫాలో అవుతూ విశ్వంభర మేకర్స్ ఈ సినిమా రిలీజ్ ని చిరంజీవి బర్త్డే రోజుకి వాయిదా వేసి చిరంజీవి బర్త్డే రోజు అంటే ఆగస్టు 22నే ఈ మూవీని భారీ అంచనాలతో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా..?
ఒకవేళ ఇదే నిజమైతే చిరంజీవికి సంబంధించిన స్పెషల్ డే న విడుదలయ్యే విశ్వంభర మూవీ హిట్ అయ్యి సెంటిమెంట్ రిపీట్ చేస్తుందో చూడాలి. ఇక చిరంజీవి బర్త్డేకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఎంత హడావిడి చేస్తారో చెప్పనక్కర్లేదు. అలాంటి స్పెషల్ డే న విశ్వంభర సినిమా విడుదలై ఫ్యాన్స్ ని ఖుషీ చేయాలని చిరంజీవి అలాగే మూవీ మేకర్స్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.మరి విశ్వంభర మూవీ రిలీజ్ ఆగస్టులోనే ఉంటుందా.. లేక అంతకంటే ముందే విడుదలవుతుందా అనేది చూడాలి