Allu Arjun : అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీకి సంబంధించిన స్పెషల్ ఈవెంట్ ని మేకర్స్ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు తాజాగా ఈవెంట్ టైమ్ ఫిక్స్ చేసినట్టు వెల్లడిస్తూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు ‘పుష్ప 2’ వివాదం వల్ల వచ్చిన ఫోబియా తగ్గినట్టేనా ? అనే చర్చ మొదలైంది.
‘పుష్ప 2’ థ్యాంక్ యూ మీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న (Rashmiak Mandanna) జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. ఇందులో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేయగా, ఫాహద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 5న తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది.
మరోవైపు ఈ సినిమా వివాదం నడుస్తుండడంతో అల్లు అర్జున్ ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయారు. ఓవైపు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ పై పుష్పరాజ్ దండయాత్ర నడుస్తుంటే, మరోవైపు అల్లు అర్జున్ కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇక ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత కూడా ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘పుష్ప 2’ థాంక్ యూ మీట్ ను మేకర్స్ నిర్వహించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ఉంటుందని తెలియజేస్తూ మైత్రి మూవీ మేకర్స్ వారు స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు.
అల్లు అర్జున్ కి ఆ ఫోబియా తగ్గినట్టేనా?
‘పుష్ప 2’ మూవీ ఇంత సక్సెస్ అయినా, అల్లు అర్జున్ బయట ఎక్కడా కనిపించకుండా పోవడానికి కారణం ‘పుష్ప 2’ వివాదం. ఈ మూవీ ప్రీమియర్ షోల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఆయనను తేరుకోలేని షాక్ కు గురి చేసింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ రోడ్ షో చేస్తూ రావడం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది అంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఫలితంగా ఓ రోజంతా జైల్లో ఉండి, ఆ తర్వాత కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు నుంచి బన్నీకి రిలీఫ్ లభించినప్పటికీ, వివాదం వల్ల ఆయన బాగా భయపడిపోయాడని టాక్ నడిచింది. తన చుట్టూ ఏం జరుగుతుందో అనే టెన్షన్ తో ఆయనకు విచిత్రమైన ఫోబియా పట్టుకుందని అంటున్నారు. అందుకే ‘తండేల్’ మూవీ ఈవెంట్ కి గెస్ట్ గా రావలసిన బన్నీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారని కామెంట్స్ వినిపించాయి. మరి ఇప్పుడు ఆయన ‘పుష్ప 2’ థాంక్ యూ మీట్ లో పాల్గొంటారా? బన్నీకి ఉన్న ఈ ఫోబియా తగ్గినట్టేనా? అనేది తెలియాలంటే ఈవెంట్ లో చూడాల్సిందే.
An evening to celebrate INDIAN CINEMA'S INDUSTRY HIT ✨❤️🔥#Pushpa2TheRule THANK YOU MEET today from 5 PM onwards 🤩
Stay tuned!
▶️ https://t.co/5kpg8vseac#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp @NavinNooli… pic.twitter.com/pQvMvqVLRy
— Mythri Movie Makers (@MythriOfficial) February 8, 2025