BigTV English

Kissik Song: కిసిక్ క్రేజ్.. బాలేదు అంటూనే ఎగబడి చూస్తున్న ప్రేక్షకులు, 24 గంటల్లోపే రికార్డులు బ్రేక్

Kissik Song: కిసిక్ క్రేజ్.. బాలేదు అంటూనే ఎగబడి చూస్తున్న ప్రేక్షకులు, 24 గంటల్లోపే రికార్డులు బ్రేక్

Kissik Song: ఈరోజుల్లో హీరోల క్రేజ్ గురించి తెలియాలంటే వారికి సంబంధించిన సినిమా అప్డేట్ ప్రేక్షకుల్లోకి ఎంత ఫాస్ట్‌గా వెళ్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ విషయంలోనే కాదు.. ఆ మూవీ టీజర్, ట్రైలర్, పాటలు.. ఇలా ఏవి విడుదలయినా కూడా యూట్యూబ్‌లో వాటికి ఎంత ఫాస్ట్‌గా రీచ్ వస్తుంది అనేదానిపై ఆ హీరో క్రేజ్ డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టే ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ విషయంలో ఫ్యాన్స్ కూడా ఇదే చేస్తున్నారు. ఈ మూవీ నుండి విడులదయిన ‘కిసిక్’ పాటతో రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధమయ్యారు.


కిసిక్ క్రేజ్

‘పుష్ప 2’ (Pushpa 2) వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో ఇప్పటివరకు ఈ మూవీ నుండి పెద్దగా అప్డేట్స్ బయటికి రాలేదు. ఒక ఫోజుతో పోస్టర్లు విడుదల చేయడం తప్పా కొన్నిరోజుల పాటు అసలు ఫ్యాన్స్‌కు ఎలాంటి అప్డేట్ షేర్ చేయలేదు మేకర్స్. ఇంతలోనే మెల్లగా ఈ సినిమా నుండి పాటల సందడి మొదలయ్యింది. ముందుగా ‘పుష్ప పుష్ప’ అనే టైటిల్ సాంగ్‌తో ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. ఆ తర్వాత రష్మిక, బన్నీ మధ్య మంచి లవ్ ట్రాక్ అయిన ‘సూసేకి’ని విడుదల చేశారు. ఈ రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ‘పుష్ప 2’ టీజర్ గ్లింప్స్ కూడా విడులదయిన 24 గంటల్లోనే రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు కిసిక్ (Kissik) పాట విషయంలో కూడా అదే జరిగింది.


Also Read: బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… గంటల్లో షూటింగ్ పూర్తి

శ్రీలీలతోనే సాధ్యం

‘పుష్ప 2’లో కచ్చితంగా ఒక బాలీవుడ్ బ్యూటీ ఐటెమ్ సాంగ్ చేస్తుందని మొదటినుండి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఫైనల్‌గా వారందరూ ఈ అవకాశం వదులుకోవడంతో అది శ్రీలీల చేతికి వచ్చింది. ఒకప్పుడు ఐటెమ్ సాంగ్స్ చేయడం ఇష్టం లేదని చెప్పిన శ్రీలీల.. ఇప్పుడు ‘పుష్ప 2’ లాంటి పాన్ ఇండియా సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ రావడంతో నో చెప్పలేకపోయింది. అలా అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేసింది. శ్రీలీల పోస్టర్‌తో ముందుగా ‘కిసిక్’ పాట గురించి అధికారికంగా ప్రకటించింది టీమ్. దీంతో శ్రీలీలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

మిక్స్‌డ్ టాక్‌తోనే

‘పుష్ప 2’లో కిసిక్‌తో క్రేజ్ వస్తుంది అనుకున్న మేకర్స్.. ఆలస్యం చేయకుండా ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. పాట విడుదల అవ్వగానే దీనికి అంతగా పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు. శ్రీలీల ఊహించనంత రేంజ్‌లో లేదని, ‘పుష్ప’లో ఊ అంటావా క్రేజ్‌కు మ్యాచ్ అవ్వలేదని.. ఇలా చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు నెటిజన్లు. కానీ ఆ నెగిటివ్ కామెంట్స్ అన్నీ దాటి 24 గంట్లోనే రికార్డ్ క్రియేట్ చేసింది కిసిక్. విడుదలయిన 18 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. మామూలుగా ఇలాంటి వ్యూస్ రావాలంటే ఏ వీడియోకు అయినా కనీసం 24 గంటలు కావాలి. కానీ కిసిక్‌కు మాత్రం 18 గంటల్లో సాధ్యమయ్యింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×