Pushpa : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ కి సిద్ధమవుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో పుష్ప-2 ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ఇదివరకే వచ్చిన పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పాలి. ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ కి లభించింది. అయితే ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకి నేషనల్ అవార్డు అనేది రాలేదు. దీని గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ కూడా తెలుగు హీరోకి రాకపోవటం అనేది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకనే నేను గురి చూసి మరి దీన్ని కొట్టాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇది కొంతమందికి సంతోషాన్ని ఇచ్చిన విషయమే.
రీసెంట్ టైమ్స్ లో అల్లు అర్జున్ మీద విపరీతమైన నెగెటివిటీ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ పార్టీకి అయితే వ్యతిరేకంగా పోటీ చేశారో, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి మద్దతుగా నిలబడటమే అల్లు అర్జున్ చేసిన తప్పు అనేది కొంతమంది అభిప్రాయం. అయితే దీనికి అల్లు అర్జున్ సమాధానం ఇస్తూ అది నేను ఫ్రెండ్షిప్ ఇచ్చిన వాల్యూ అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ,మెగా ఫ్యాన్స్ కి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : Kollywood: పెరుగుతున్న విడాకుల కల్చర్..ఇప్పటికే ..?
ఈ వార్ ను కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు వాడుకోవడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తూ కొన్ని రకమైన కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు అల్లు అర్జున్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు పుష్ప సినిమా ఫలితం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో తప్ప మిగతా అన్నిచోట్ల ఈ సినిమా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో వర్కౌట్ కాకపోవడానికి కారణం ఏమిటంటే అప్పట్లో అక్కడ ఉన్న టికెట్ రేట్లు. చాలా తక్కువ రేట్లతో ఈ సినిమా టికెట్లను విక్రయించారు.
రీసెంట్ గా ఈ సినిమా నిర్మాతలు కూడా తాము పవన్ కళ్యాణ్ గారిని కల్కి సినిమా టైంలో కలిసామని టికెట్ రేట్ల విషయంలో ఆయన బాగా సపోర్ట్ చేశారని కూడా మాట్లాడారు . ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి కి చెప్పి ఎటువంటి జీవో నైనా తీసుకురాగలిగే సామర్థ్యం ఉంది. అయితే వైసిపి ప్రతినిధులు సపోర్ట్ అందిస్తున్నాము అని ఇప్పుడు చెప్తున్నారు. ఒకప్పుడు మీ వలనే సినిమా అక్కడ ఫెయిల్ అయింది. అసలు పుష్ప కి రేట్లు పరంగా సపోర్ట్ అందిస్తుంది ఈ ప్రభుత్వమే. అంటూ కొంతమంది రివర్స్ అటాక్ చేయడం మొదలుపెట్టారు.
Also Read : Ram Gopal Varma Case: వర్మ వెనక ఉన్న టాలీవుడ్ హీరో ఎవరు..? ఆ ఫామ్ హౌజ్ ఎక్కడ ఉంది..?