BigTV English

Pushpa 2 Movie Shooting : బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… గంటల్లో షూటింగ్ పూర్తి

Pushpa 2 Movie Shooting : బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… గంటల్లో షూటింగ్ పూర్తి

Pushpa 2 Movie Shooting : అల్లు అర్జున్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ “పుష్ప 2”. భారీ హైప్ నెలకొన్న ఈ సినిమా ప్రమోషన్స్ ఓవైపు జోరుగా సాగుతుంటే, మరోవైపు సినిమా ఆగిపోతుంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ పై తాజాగా వచ్చిన అప్డేట్ తో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ యాక్షన్ ఎంటర్టైన “పుష్ప 2 : ది రూల్”. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ఈ మూవీని రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్నట్టుగానే ప్రమోషన్లు కూడా షురూ చేశారు. కానీ అంతలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు అనే వార్తలు బయటకు రావడంతో, మూవీ అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఫస్ట్ కాపీ నవంబర్ 20న రెడీ అవుతుందని ముందుగా నిర్మాతలు చెప్పారు. కానీ తీరా చూస్తే నవంబర్ 28 నాటికి షూటింగ్ పూర్తవుతుందనే టాక్ వినిపించింది.

కానీ అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ కు కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది. దీంతో అసలు డిసెంబర్ 5న “పుష్ప 2” తెరపైకి రావడం అన్నది సాధ్యమేనా ? అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈరోజు ఇంకో 3 గంటల షూటింగ్ చేస్తే “పుష్ప 2” షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటిదాకా సినిమా పోస్ట్ పోన్ అవుతుందా ? అని అనుమాన పడుతున్న అల్లు అర్జున్ అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.


ఇక ఈ మూడు గంటల షూటింగ్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా చేస్తున్నారు. మాలీవుడ్లో ఈ నెల 27న “పుష్ప 2” ఈవెంట్ ఉండబోతుంది అన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు మలయాళం లిరిక్స్ కలిపి ఉన్న ఓ సాంగ్ ను ఇప్పుడు కేరళ ఈవెంట్ కోసమే షూట్ చేస్తున్నరట. అందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న కనిపిస్తారని తెలుస్తోంది. ఎట్టకేలకు “పుష్ప 2” షూటింగ్ అనుకున్న టైం కంటే ముందుగానే పూర్తి కావడం అన్నది అల్లు అర్జున్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతుంది. ఇక ప్రమోషన్ల పరంగా పుష్పరాజ్ జోరు చూస్తుంటే ఈ సినిమా అనుకున్న టైం రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక నిన్న మొన్నటిదాకా “పుష్ప 2” మూవీ పోస్ట్ పోన్ అవుతుందని, అదే కనుక జరిగితే మూవీ డిసెంబర్ 19న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ రిలీజ్ విషయంలో తగ్గేదే లేదు అంటూ ఇప్పటిదాకా పోస్టర్ల ద్వారా వెల్లడించిన చిత్ర బృందం… ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసి, వాటికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇదిలా ఉండగా మరోవైపు “పుష్ప 2” నుంచి రిలీజ్ అయిన “కిస్సిక్” హోరెత్తిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటలో అల్లు అర్జున్, శ్రీలీల ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇక ఇప్పుడు రష్మిక, బన్నీ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×