Himachal floods: ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లా-లాహౌల్-స్పితి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలు సంభవించాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.
హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా దాదపు 300కు పైగా రోడ్లు మూతపడ్డాయి. అందులో కీలకమైన జాతీయ రహదారులు సైతం ఉన్నాయి. సిమ్లాలో కురుస్తున్న వర్షానికి బస్టాండ్ కుప్పకూలిపోయింది. దాని పక్కనేవున్న షాపులు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల మధ్య వంతెలు కొట్టుకుపోయాయి.
కూట్-క్యావ్ పంచాయతీలకు రోడ్డు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. గాన్వి రేవైన్ ప్రాంతంలో వరదల బీభత్సానికి ఓ పోలీస్ పోస్ట్ కొట్టుకుపోయింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తినష్టం భారీగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు.
లాహౌల్-స్పితి జిల్లాలోని మయాడ్ లోయలో క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల వల్ల కర్పాట్, చంగుట్, ఉద్గోస్ నాలా ప్రాంతాల్లో మరో రెండు వంతెనలు కొట్టుకుపోయాయి. కర్పాట్ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో పరిస్థితి గమనించిన అధికారులు, ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ALSO READ: దేశ రాజధానిని ముంచెత్తిన వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వివరాల ప్రకారం, జాతీయ రహదారులు ఎన్‌హెచ్-305, ఎన్‌హెచ్-505 సహా మొత్తం 325 రోడ్లు మూతపడ్డాయి. మండి జిల్లాలో 179, కులులో 71 రోడ్లు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనురాధ రాణా మియార్ లోయలోని పాఠశాలలను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.
బుధవారం వేకువజామున టోలాండ్ సమీపంలో సర్క్యులర్ రోడ్డుపై చెట్టు కూలిపోయాయి. దీంతో పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు తమతమ కార్యాలయాలకు వెళ్లేందుకు నానాఇబ్బందులు పడ్డారు. వాటిని తొలగించే వరకు బస్సులు నిలిచిపోయాయి. చిన్న వాహనాల ద్వారా రాకపోకలు కొనసాగించారు.
గురువారం చంబా, కాంగ్రా, మండి ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం నుండి ఆదివారం వరకు నాలుగు నుండి ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అధికారులు.
VIDEO | Himachal Pradesh: Three bridges in Mayad Valley, Lahaul & Spiti were washed away by a recent cloudburst, disrupting local connectivity.#LahaulSpiti #Cloudburst
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/bKeWzvrFF6
— Press Trust of India (@PTI_News) August 13, 2025
This is Himachal now. Same scene as Uttarkashi.
Kullu on high alert. #Rain #cloudburst @SkymetWeather
pic.twitter.com/OGLTbBzlIa— Milann Desai (@Milan_reports) August 14, 2025