Akkineni Akhil : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బడా ఫ్యామిలీగా అక్కినేని ఫ్యామిలీ కొనసాగుతోంది. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మూల స్తంభం లాంటివారు. అలాంటి ఆయన వారసత్వం ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంది. తండ్రి వారసత్వాన్ని తీసుకొని అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు కానీ, ఈయన వారసత్వాన్ని పొందిన అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), అక్కినేని అఖిల్ (Akkineni Akhil) మాత్రం స్టార్ స్టేటస్ కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. ఇదిలా ఉండగా ఒకవైపు నాగచైతన్య ఇటీవలే తనకు నచ్చిన ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల (Shobhita dhulipala) తో ఏడడుగులు వేసి, రెండోసారి కొత్త వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు.
ఇప్పుడు అఖిల్ కూడా పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న తాను ప్రేమించిన జైనాబ్ రవ్ డ్జీ తో నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ నెల అనగా జూన్ 6న జరగబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు నాగార్జున తన కొడుకు పెళ్లి డేట్ చెప్పలేదు.కానీ రీసెంట్ గా సీఎంని కలవడంతో ఈ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అఖిల్ జైనాబ్ ల పెళ్లి జూన్ 6న అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అఖిల్ కాబోయే భార్య జైనాబ్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. మరి జైనాబ్ రవ్ డ్జీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
జైనాబ్ రవ్ డ్జీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
జైనాబ్ రవ్ డ్జీ తండ్రి పేరు జుల్ఫీ రవ్ డ్జీ.. ఈయన నిర్మాణరంగంలో అగ్రగామిగా ఉన్నారు. అలాగే జైనాబ్ సోదరుడు కూడా జే.ఆర్.రెన్యువబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కి చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు..అలా వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన జైనాబ్ వ్యాపార రంగంలో రాణించకుండా వేరే దారి ఎంచుకుంది.
1. జైనాబ్ రవ్ డ్జీ ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకుంది.ఇక జైనబ్ MF హుస్సేన్ ఆర్ట్ ఫిలిం అయినటువంటి మీనాక్సీ:ఏ టేల్ ఆఫ్ 3 సిటీస్ లో నటించింది.
2. ఈమె నటి మాత్రమే కాకుండా దుబాయ్, లండన్ వంటి దేశాలలో తన పెయింటింగ్ తో ఆర్ట్ గ్యాలరీల ఎగ్జిబిషన్ పెట్టి ఎంతోమందిని ఆకట్టుకుంది. అలా జైనబ్ రవ్ డ్జీ కేవలం నటిగానే కాకుండా సృజనాత్మక కళాకారిణి గా పలు పెయింటింగ్స్ వేస్తూ ఎన్నో దేశాల్లో ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్స్ లో పాల్గొంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
3. అలాగే చర్మ సంరక్షణ, సుగంధ ద్రవ్యాల తయారీకి సంబంధించి ‘వన్స్ అపాన్ ది స్కిన్’ అనే బ్లాగును కూడా నడిపిస్తుంది.. ఈ బ్లాగ్ లో సువాసనలు, పదార్థాలు, జ్ఞాపకశక్తి భావోద్వేగాలతో ఎలాంటి సంబంధం ఉంటుంది అనే దాని గురించి చెబుతుంది.
4. ఇక జైనబ్ రవ్ డ్జి సంపాదన విషయానికి వస్తే..ఆమె తండ్రి నుండి వచ్చిన ఆస్తులు కాకుండా స్వతంత్ర జీవితాన్ని గడుపుతూ నటిగా అలాగే బ్లాగర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తోంది.
5. అయితే అక్కినేని అఖిల్ గత కొద్ది సంవత్సరాల నుండి జైనాబ్ రవ్ డ్జీతో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే జైనాబ్ రవ్ డ్జీ అఖిల్ కంటే వయసులో చాలా పెద్దది అనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి.