Upcoming Movies : ప్రతి నెల బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మే నెలలో రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే జూన్ మొదటి వారంలో కూడా బోలెడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు అన్ని కూడా ఈ నెలలోనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ నెలలోనే పెద్ద సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ సందడి చేసే వాటిలో కమల్ హాసన్ సినిమా కూడా ఒకటి.. ఈ మూవీతో పాటుగా ఎలాంటి సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు..
థగ్ లైఫ్..
డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న థగ్ లైఫ్. ఇందులో త్రిష, అభిరామి, శింబు కీలక పాత్రలో నటించారు. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న కావడంతో భారీ హైప్ నెలకొంది. జూన్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.. ఈ మూవీ ఇప్పటికే ఎన్నో వివాదాలతో సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి రిలీజ్ కాబోతుంది.
శ్రీశీశ్రీ రాజావారు..
నార్నె నితిన్.. మ్యాడ్ సిరీస్ సినిమాలతో హీరోగా సక్సెస్ అయ్యాడు.. ఆ మూవీతో స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ మూవీల కన్నా ముందుగా శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమా చేశాడు. ఆ మూవీ కొన్ని కారణాలతో వాయిదా పడుతుంది. ఇన్నాళ్లకు ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది..
సంపద కథానాయికగా నటించగా.. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించారు.. 2022లో ఈ షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ఆలస్యంగా విడుదలవుతుంది. జూన్ 6న ఈ రిలీజ్ కానుంది..
వీటితోపాటు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ నటించిన చిత్రం హౌస్ ఫుల్ 5. జూన్ 6న ఈ రిలీజ్ కానుంది.. అదే విధంగా సంగీత్ శోభన్ హీరోగా రూపొందించిన గ్యాంబ్లర్స్ మూవీ జూన్ 6న రిలీజ్ కానుంది. మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి కలిసి నటించారు.. థియేటర్లలో ఈ సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఈ నెల రెండో వారంలో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చెయ్యబోతున్నాయి.
ఈ వారం ఓటీటీలో సందడి చెయ్యబోతున్న సినిమాలు..
అమెజాన్ ప్రైమ్..
స్టోలెన్.. హిందీ.. జూన్ 4
జియో హాట్ స్టార్..
టూరిస్ట్ ఫ్యామిలీ.. తమిళం, తెలుగు.. జూన్ 2
గజానా.. హిందీ.. జూన్ 2
దేవికా అండ్ డాని.. తెలుగు.. జూన్ 6
నెట్ ఫ్లిక్స్..
వన్ ఆఫ్ ది దెమ్ డేస్.. హాలీవుడ్.. జూన్ 4
జాబ్.. హిందీ.. జూన్ 5
వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి…ఇప్పటివరకు ఇవే సినిమాలు డేట్స్ ను లాక్ చేసుకున్నాయి. మధ్యలో కొత్త సినిమాలు కూడా ఓటీటీలోకి సడెన్ గా వచ్చేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ నెలలో కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.