BigTV English

Rajamouli : రాజమౌళితో 3 సినిమాలు చేశావ్.. ఎప్పుడైనా నిన్ను ఇలా పొగిడాడా? ఎన్టీఆర్‌పై పీకే ఫ్యాన్స్ ట్రోల్స్!

Rajamouli : రాజమౌళితో 3 సినిమాలు చేశావ్.. ఎప్పుడైనా నిన్ను ఇలా పొగిడాడా? ఎన్టీఆర్‌పై పీకే ఫ్యాన్స్ ట్రోల్స్!

Rajamouli: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబడతాయి అంటే ఈయనకు ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టం అవుతుంది. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని మంచి కెరియర్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఇలా రాజకీయాలలో కొనసాగుతూనే మరోవైపు అడపాదడపా సినిమాలు చేశారు.


ఎన్టీఆర్ టార్గెట్ అయ్యారా..

ఇక ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజారిటీతో విజయం అందుకోవడంతో ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు కానీ, ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా జూన్ 12వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక స్క్రీన్ లపై విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి విడుదల కాబోతున్న సినిమా కావటంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


నీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడారా…

ఇక ఈ సినిమా విడుదలకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలోనే ఉన్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులను టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గతంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తూ ఎన్టీఆర్ పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజ మౌళి హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్.ఎస్ రాజమౌళి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తన మ్యానరిజంతో (చేతితో మెడ పట్టుకోవడం) ఒక్కసారి అంటే చాలు ఆయనకు ఆడియన్స్ పల్స్ మొత్తం తెలుస్తుంది అనుకుంటా.. ఆ ఒక్క షాట్ వేసినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ చూస్తే తెలుస్తుంది ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఏంటో అంటూ రాజమౌళి మాట్లాడిన ఈ క్లిప్ వైరల్ చేస్తూ ఎన్టీఆర్ ను టార్గెట్ చేశారు. ఎన్టీఆర్ రాజమౌళితో మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను చేశావు. ఏరోజైనా మీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఇలా మాట్లాడారా… క్రేజ్ కా బాప్ అని బాలీవుడ్ నుంచి మొదలుకొని మాలీవుడ్ వరకు ఎవరినడిగినా వెంటనే పవన్ కళ్యాణ్ పేరు చెబుతారు అంటూ పవన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవ్వటమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే విధంగా వార్ నడుస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×