7G Rainbow Colony 2 :7G బృందావన కాలనీ 20 ఏళ్ల కింద యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ. 2004లో తమిళం తో పాటు తెలుగులోను విడుదలై ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది . ఇప్పుడు దీని సీక్వెల్ కోసం అందరూ అసెక్తి గా ఎదురుచూస్తున్నారు .దీంతో ఏ చిన్న విషయమైనాక్షణాల్లో వైరల్గా మారుతుంది . దర్శకుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాటలు సినీ ప్రియుల్లో జోష్ నింపుతున్నాయి.అయన ఏమన్నారంటే …
సెల్వ మాటలలో ..
” పార్ట్ వన్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని హార్ట్ ఫుల్ స్టోరీ తో పార్ట్ 2 ను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే సినిమా 50% షూటింగ్ పూర్తయింది. పార్ట్ వన్ క్లైమాక్స్లో హీరో జాబ్ రావడం ఒంటరిగా మిగిలిపోవడం వంటి సీన్స్ తో ఎండ్ చేసాము. ఆ తర్వాత పదేళ్లపాటు అతడి జీవితం ఎలా సాగింది.. అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సీక్వెల్ ని రెడీ చేస్తున్నాం. సీక్వెల్ లో ఏం జరుగుతుందనే దాని గురించి పార్ట్ వన్ లో కూడా కొంచెం క్లారిటీ ఇచ్చాం. ఇప్పుడున్న రోజుల్లో చిన్న సినిమాగా రిలీజ్ చేయడం అన్నది సాధ్యం కాని విషయం. ప్రేక్షకులు ఈ సీక్వెల్ గురించి చాలా ఇంట్రెస్ట్ గా తో ఎదురుచూస్తున్నప్పుడు నేను ఈ సినిమాని చిన్న సినిమాగా రిలీజ్ చేయడం సాధ్యం కాదు. అందుకే ఒక పెద్ద సూపర్ హిట్ సినిమాగా మీ ముందుకు తీసుకురావడానికి సినిమాని రెడీ చేస్తున్నాం ” అని సెల్వ ఇంటర్వ్యూలో తెలిపారు .
సీక్వెల్ గురించి ..
పార్ట్ 1 లో హీరోగా రవికృష్ణ హీరోయిన్ గా సోనియా అగర్వాల్ నటించారు.ఈ సినిమా సూపర్ హిట్ అవడానికి ప్రధాన కారణం హీరో అని చెప్పొచ్చు. పార్ట్ వన్ లో ఒక సాధారణ యువకుడి పాత్రలో రవికృష్ణ అద్భుతంగా నటించారు.ఈ మూవీలో మరో ప్రధాన పాత్ర సుమన్ శెట్టి చేసారు . ఆ మూవీలో హీరోయిన్ చనిపోయినట్లు చూపించారు . పార్ట్ 2 లో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జయరాం, సుమన్ శెట్టి, సుధా లాంటి నటులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎఎం. రత్నం నిర్మిస్తున్నారు.
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో, తమిళ్ సినిమా 7/G రెయిన్ బో కాలనీ తెలుగులో 7/G బృందావన్ కాలనీ గా డబ్బింగ్ అయ్యి సూపర్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే ఈ సినిమా సాంగ్స్ సోషల్ మీడియాలో ఇప్పటికి ట్రెండ్ అవుతున్నాయి .ఇటీవల విడుదల చేసిన సినిమా పార్ట్ 2 పోస్టర్ అంచనాలని భారీగా పెంచేసింది . యువన్ శంకరాజా మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాకి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల రీ రిలీజ్ అయి మంచి హిట్ అందుకుంది. దీనితో సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని యూత్ అంతా ఎదురుచూస్తున్నారు .దీని గురించి మరిన్ని వివరాలు తెలియాలి అంటే ఇంకొంత కాలం వేచి వుండాలిసిందే ..