Akhil Akkineni’s Upcoming Film : సిసింద్రీ సినిమాతోనే అతి చిన్న ఏజ్ లో చాలామంది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి మంచి పేరు సాధించుకున్నాడు అక్కినేని అఖిల్. ఆ తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన మనం సినిమాలో క్లైమాక్స్ లో కనిపించి విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తన ప్రతిభ చూపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. అక్కినేని అఖిల్ ఎంత బాగా క్రికెట్ ఆడుతాడు అని అందరికీ తెలిసిన విషయమే. ఒక టైంలో అఖిల్ మంచి క్రికెటర్ అయిపోతాడని చాలామంది ఊహించారు. అయితే మొత్తానికి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అఖిల్ అనే పేరుతో ఉన్న టైటిల్ ని ఎంచుకొని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. నితిన్ ఈ సినిమాని నిర్మించాడు.
ఈ సినిమా తర్వాత చేసిన మిస్టర్ మజ్ను (Mr Manju) సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఎట్టకేలకు విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) అఖిల్ కి మంచి హిట్ సినిమా ఇస్తాడు అని భావించి హలో (Hello) అనే సినిమా చేశారు. ఆ సినిమా కూడా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhasker) చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అఖిల్ కెరియర్ లో ఇదే మొదటి హిట్ సినిమా అని చెప్పాలి. ఈ సినిమాకి మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ అనే ఒక సినిమాను చేశాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ సినిమా మినిమం అంచనాలను అందుకోలేకపోయింది.
Also Read : Krish Jagarlamudi: సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్..
ఇక ప్రస్తుతం ఏజెంట్ (Agent) సినిమా తర్వాత ఇప్పటివరకు అఖిల్ ఒక సినిమా కూడా చేయలేదు. అఖిల్ తన నెక్స్ట్ సినిమా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (Murali Kishor Abburi) తో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరగనుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు యూవి క్రియేషన్స్ లో కూడా అఖిల్ ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.