BigTV English

Ranya Rao : గోల్డ్ స్మగ్లింగ్ లో అడ్డంగా దొరికిపోయిన రన్యా రావు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?

Ranya Rao : గోల్డ్ స్మగ్లింగ్ లో అడ్డంగా దొరికిపోయిన రన్యా రావు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?

Ranya Rao : 12 కోట్ల రూపాయల విలువైన 14.8 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది కన్నడ హీరోయిన్ రన్యా రావు (Ranya Rao). మార్చ్ 3న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసలు రన్యా రావు ఎవరు? అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజెన్లు.


రన్యా రావు బ్యాగ్రౌండ్ ఇదే

రన్యా రావు కన్నడతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించింది. అయితే ఇప్పటిదాకా ఆమె కేవలం మూడు సినిమాల్లో మాత్రమే తెరపై మెరిసింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా పని చేస్తున్న ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె ఈ రన్యా రావు. కర్ణాటకలోని చిక్కమగులూరు జిల్లాకు చెందిన ఈ బ్యూటీ బెంగళూరులోనే పాఠశాల విద్యను పూర్తి చేసింది.


2014లో ఆమె కోలీవుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) సరసన కన్నడలో తొలిసారిగా ‘మాణిక్య’ (Maanikya) అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రభాస్ తెలుగు చిత్రం ‘మిర్చి’కి రీమేక్. రెండు సంవత్సరాల తర్వాత ఆమెకు విక్రమ్ ప్రభు సరసన ‘ అనే తమిళ సినిమాలో నటించే అవకాశం దక్కింది. అయితే ఫస్ట్ మూవీ ‘మాణిక్య’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, తమిళ సినిమాకు మాత్రం నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.

ఇక 2017లో ఈ బ్యూటీ యాక్షన్ – కామెడీ మూవీ ‘పటాకీ’తో కన్నడ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా ‘పటాస్’కి రీమేక్ అయిన ఈ సినిమాలో ఆమె ప్రముఖ కన్నడ నటుడు గణేష్ తో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకుంది. రన్యా రావు తెరపై కనిపించిన చివరి సినిమా కూడా ‘పటాకి’నే కావడం గమనార్హం. ఈ మూవీ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.

గోల్డ్ స్మిగ్లింగ్ లో బుక్

ఇక మూడు సినిమాలు మాత్రమే చేసిన రన్యా రావు కేవలం 15 రోజుల్లోనే నాలుగు సార్లు దుబాయ్ కి వెళ్లి వచ్చిందట. ఈ విషయాన్ని గమనించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆమెపై నిఘా వేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న డిఆర్ఐ అధికారులు మార్చ్ 3న ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన హీరోయిన్ ని అరెస్ట్ చేశారు. 33 సంవత్సరాల వయసున్న రన్యా రావు తన జాకెట్ లో బంగారు కడ్డీలను దాచి అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక కస్టమ్స్ ను క్లియర్ చేయడానికి ఆమె తన ఇన్ఫ్లూయెన్స్ ను ఉపయోగించి ఉండొచ్చని అంటున్నారు.

సమాచారం ప్రకారం ఆమె ఇప్పటిదాకా 12.56 కోట్ల విలువైన బంగారాన్ని స్మగుల్ చేసిందని అంటున్నారు. అరెస్ట్ తర్వాత బెంగళూరులోని రన్యా రావు నివాసంలో సోదాలు నిర్వహించగా, అక్కడ 2.6 కోట్ల బంగారు ఆభరణాలు, 2.67 కోట్ల విలువైన ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇటీవల కాలంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డ అత్యంత భారీ గోల్డ్ స్మగ్లింగ్ ఇదే కావడం గమనార్హం.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×