BigTV English

Scenic Train Rides US: అమెరికాలో అద్భుతమైన రైలు ప్రయాణాలు, అస్సలు మిస్ కాకండి!

Scenic Train Rides US: అమెరికాలో అద్భుతమైన రైలు ప్రయాణాలు, అస్సలు మిస్ కాకండి!

ప్రపంచంలోని అందమైన దేశాల్లో అమెరికా ఒకటి. ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. యుఎస్ లోని అద్భుతమైన టూరిజం ప్లేసెస్ చూసేందుకు ప్రతి ఏటా లక్షలాది మంది విదేశీ పర్యాటకులు తరలి వస్తారు. ఆయా ప్రాంతాలను తిలకించేందుకు చక్కటి రైల్వే లైన్లు ఉన్నాయి. అమెరికాలో కనువిందు చేసే రైల్వే ప్రయాణాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


⦿ నాపా వ్యాలీ వైన్ రైలు

అమెరికాలో కనువిందు చేసే రైలు ప్రయాణాల్లో ఇది ఒకటి. హిస్టారికల్ పుల్‌ మాన్ రైలు అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ దూసుకెళ్తుంది. ఈ రైలు ప్రయాణం 36 మైళ్ల దూరం కొనసాగుతుంది. నాపా నుంచి సెయింట్ హెలెనా వరకు రైలు ప్రయాణం చెయ్యొచ్చు. గ్రిగిచ్ హిల్స్, కేక్‌ బ్రెడ్ లాంటి వైన్ తయారీ కేంద్రాల గుండా ఈ రైలు తీసుకెళుతుంది. ఇందులో చక్కటి భోజనం, వైన్ రుచి చూసే అవకాశం ఉంటుంది.


⦿ కుయాహోగా వ్యాలీ సీనిక్ రైల్‌ రోడ్

ఈ రైలు ప్రయాణం ఒహియోలోని కుయాహోగా వ్యాలీ నేషనల్ పార్క్ మీదుగా కొనసాగుతుంది. చక్కటి బీరు రుచి చూస్తూ సుందరమైన గ్రామీణ ప్రాంతాల అందాలను చూస్తూ ముందుకు సాగవచ్చు.

⦿ రాయల్ జార్జ్ రూట్ రైల్‌ రోడ్

కొలరాడో స్ప్రింగ్స్ సమీపంలోని రాయల్ జార్జ్ రూట్ రైల్‌ రోడ్ వెంబడి ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది.  కొలరాడో రాకీస్ కు సంబంధించి అద్భుతమైన వ్యూ చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. అద్భుతమైన పర్వత దృశ్యాలను  విస్టా డోమ్ నుంచి చూస్తూ ముందుకు సాగవచ్చు. ఆన్ బోర్డ్ ఫుడ్ తీసుకుంటూ సరదాగా గడిపే అవకాశం ఉంటుంది.

⦿ ఎకో కాన్యన్ రివర్ ఎక్స్‌ పెడిషన్స్

రాయల్ జార్జ్ రూట్ రైల్‌ రోడ్‌  రైలు ప్రయాణాన్ని అర్కాన్సాస్ నది వెంట కొనసాగించే అవకాశం ఉంటుంది. రాఫ్టింగ్ అడ్వెంచర్‌ ఫీల్ కావచ్చు. రెండు గంటల పాటు కొనసాగే ఈ రైలు ప్రయాణం రోజుకు రెండు సార్లు ఉంటుంది. ఉదయం పూట ఓసారి, మధ్యాహ్నం మరోసారి రౌండ్ వేస్తుంది. బిగార్న్ షీప్ కాన్యన్ తో పాటు సాహసోపేతమైన వైట్ వాటర్ రాఫ్టింగ్‌ వరకు కొనసాగుతుంది.

⦿ గ్రాండ్ కాన్యన్ రైల్వే

అమెరికాలో తప్పకుండా వెళ్లాల్సిన రైలు ప్రయాణం గ్రాండ్ కాన్యన్ రైల్వే జర్నీ. అరిజోనాలోని విలియమ్స్‌ రైలు డిపో నుంచి ప్రతిరోజూ బయలుదేరే ఈ రెండు గంటల రైలు ప్రయాణం.. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులోని ప్రయాణీకులకు చక్కటి ఫుడ్ అందిస్తారు.

⦿ ఆమ్‌ ట్రాక్ వెకేషన్స్

డిస్కవర్ అమెరికా విత్ ఆమ్‌ ట్రాక్ వెకేషన్స్ పేరుతో అమెరికన్ రైల్వే సంస్థ ఒకటి, రెండు వారాల ట్రైన్ జర్నీ ప్యాకేజీలను అందిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ పార్కులను కలుపుతూ ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. ఆరు రోజుల ప్యాకేజీలో భాగంగా టూరిస్టులను చికాగో నుంచి మోంటానాలోని గ్లేసియర్ నేషనల్ పార్క్‌ కు తీసుకువెళ్తుంది. టూ మెడిసిన్ వ్యాలీలో బోట్ క్రూయిజ్,  గోయింగ్ టు ది సన్ రోడ్‌లో అద్భుతమైన ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

⦿ అలాస్కా రైల్‌ రోడ్

వేసవి, శీతాకాలంలో రైలు ద్వారా అలాస్కాను చూసేందుకు అలాస్కా రైల్‌ రోడ్‌ వారం రోజుల రైలు ప్రయాణ ప్యాకేజీని అందిస్తుంది.

Read Also: ఈ దేశాల్లో మన కరెన్సీ చాలా ఖరీదు, ఒక్క రూపాయి విలువ అక్కడ ఎంత అంటే?

Tags

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×