Kannappa film :టీవీ సీరియల్ ‘మహాభారతం’ ఎపిసోడ్స్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్(Mukhesh kumar singh) దర్శకత్వంలో మంచు విష్ణు(Manchu Vishnu) ప్రెస్టేజియస్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప(Kannaappa) .. జూన్ 27వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో మంచు విష్ణు, మోహన్ బాబు(Mohan Babu), మోహన్ లా(Mohan Lal), అక్షయ్ కుమార్ (Akshay Kumar) , కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), ప్రభాస్ (Prabhas) వంటి పాన్ ఇండియా స్టార్స్ భాగమయ్యారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి కానీ మరొకవైపు ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఏవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో.. విడుదలకు ముందే ఈ సినిమా నెగిటివిటీని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే
కన్నప్ప మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ వీళ్లే..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్స్ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు వారి కన్నప్ప సినిమా కోసం సాహసం చేసి మరీ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ ధైర్యాన్ని కొంతమంది నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. మీరు చాలా ధైర్యం చేశారు బ్రో అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉండడం గమనార్హం. మరి కన్నప్ప సినిమాను ప్రాంతాలవారీగా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
కన్నప్ప మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్..
నిజాం – మైత్రి ఫిలిమ్స్
సీడెడ్ – మైత్రి ఫిలిమ్స్
ఈస్ట్ – మైత్రి ఫిలిమ్స్
బెస్ట్ ఆదిత్య ఫిలిమ్స్
వైజాగ్ – అన్నపూర్ణ ఫిలిమ్స్
కృష్ణ – అన్నపూర్ణ ఫిలిమ్స్
గుంటూరు – యూ.వీ.క్రియేషన్స్
నెల్లూరు – హరి పిక్చర్స్..
ఇలా వీరంతా కూడా ప్రాంతాలవారీగా కన్నప్ప సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశారు.
కన్నప్ప బిజినెస్ డీటెయిల్స్..
మంచు విష్ణు కన్నప్ప సినిమా కోసం దాదాపుగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. అంతేకాదు ఈ బడ్జెట్ కోసం తన ఆస్తులు కూడా తాకట్టు పెట్టినట్లు ఇటీవల కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో మంచు విష్ణు తెలిపిన విషయం తెలిసిందే. ఇకపోతే మంచు విష్ణు బడ్జెట్ అయితే భారీగా పెట్టారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు ఎంత మేరా బిజినెస్ జరిగింది ? ఒకవేళ సినిమా రిలీజ్ అయితే ఆయన పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా? అసలు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతోంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కనీసం ప్రభాస్ అయినా సినిమాను కాపాడుతారా?
ఇకపోతే భారీ అంచనాలతో, భారీ తారాగణంతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న ఈ సినిమాలో ఇప్పటివరకు ఏదైనా ఒక పాజిటివ్ అంశం కనిపించిందా అంటే.. అది ప్రభాస్ లుక్ అనే చెప్పాలి. దీనికి తోడు ప్రభాస్ నటించిన 30 నిమిషాల నిడివి సినిమాకే హైలెట్గా నిలుస్తుందని, కచ్చితంగా ఆ పాత్ర కోసమైనా సినిమా చూస్తారని అటు మంచు విష్ణు, ఇటు మోహన్ బాబు ఇద్దరూ కూడా ముక్తకంఠంగా చెప్పుకొచ్చారు. మరి ప్రభాస్ కోసం అయినా సినిమాను ఫ్యాన్స్ సక్సెస్ చేస్తారేమో చూడాలి.
ALSO READ:Akhanda 2 vs OG : వాయిదా వేసే మూవీకి రిలీజ్ డేట్ ఎందుకు ? వార్ క్రియేట్ చేయడం కాకపోతే!