BigTV English

YouTube Star: యుట్యూబ్ స్టార్ పొట్టి మామ రియల్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లు ఆగవు

YouTube Star: యుట్యూబ్ స్టార్ పొట్టి మామ రియల్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లు ఆగవు

YouTube Star: ఆకారంలో అందగాడు కాదు.. శ్రీకారంలో సుందరాంగుడు కాదు.. కానీ ఆయన స్టెప్పులేస్తే యూట్యూబ్‌లో వీవర్స్ వర్షం కురుస్తుంది. ఆయన వీడియోలకు సబ్‌స్క్రైబర్‌ మోత మోగిపోతుంది. అలాగని ఆయనేమీ బ్రేక్‌ డాన్సరు కాదు అంతకన్నా స్పీడు డాన్సర్‌ కాదు. కానీ ఆయన కవర్‌ సాంగ్స్‌   రిలీజ్‌ అయ్యాయంటే మాత్రం తెగ వైరల్‌ అవుతుంటాయి. తన మాస్ స్టెప్పులతో సోషల్‌ మీడియానే షేక్‌ చేస్తున్న పొట్టి మామ రియల్‌ లైఫ్‌ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.


పొట్టి మామ రియల్‌ లైఫ్‌లో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసుకుంటే నిజంగానే కన్నీళ్లు ఆగవు. సినిమాలకు పనికిరాడన్నారు. అసలు జీవితంలో కూడా పనికిరాడని గేలి చేశారు. హేళన చేశారు. చివరికి నవ్విన నాప చేనే పండిందన్నట్టు.. పాత సామెతలా పొట్టి మామ చాలా గట్టిగానే తిరిగి వచ్చాడు. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుని యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగిపోయాడు.

పొట్టిమామ అలియాస్‌ రవీంద్ర. శ్రీకాళహస్తి దగ్గరలోని భీమవరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో  పుట్టాడు. ఏడవ తరగతి చదువుతుండగానే తల్లి చనిపోయింది. దీంతో రవీంద్రను వాళ్ల నాన్న చాలా గారాబంగా పెంచాడు. అందుకే కొడుకుకు సినిమాల పిచ్చి అని తెలిసి తనకున్న 18 ఎకరాల భూమిలో నాలుగు ఎకరాలు అమ్మీ కొడుకు చేతిలో పెడితే… ఆ డబ్బు తీసుకుని మద్రాసు రైలెక్కాడు రవీంద్ర. తండ్రి ఇచ్చిన డబ్బులు చేతిలో ఉన్నంత వరకు ఎక్కడ సినిమా షూటింగ్‌ జరిగినా అక్కడికి వెళ్లేవాడు. ఒక్క అవకాశం అంటూ కనిపించిన లైట్‌ బాయ్‌ నుంచి నిర్మాత దాకా అందరిని అడిగేవాడు. కానీ రవీంద్రకు  ఏ ఒక్క అవకాశం రాలేదు.


ఇంతలో ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఇక చేసేందేం లేక రవీంద్ర పడాల్సినన్ని సినిమా కష్టాలన్నీ పడ్డాడు. పస్తులున్నాడు.. రోడ్ల పక్కన పడుకున్నాడు. కుళాయి నీళ్లు తాగాడు. ఒక్కటేమిటి ఏవరి సపోర్టు లేకుండా సినిమా అవశాకాల కోసం తిరిగే ప్రతి ఒక్కరూ అనుభవించే కష్టాలన్నీ అనుభవించాడు. ఆకలి చంపుకోలేక.. పస్తులు పడుకోలేక ఒక సినిమా హీరోయిన్‌ ఇంట్లో ఆవిడ కుక్కులు చూసుకోవడానికి పనికి కుదిరాడు. తర్వాత ఆ పనిలోంచి తీసేస్తే.. ఏం చేయాలో తెలియక మద్రాసు రైల్వే ప్లాట్‌ ఫాం మీద కూర్చుని ఆలోచిస్తూ అక్కడే నిద్రపోయాడట. అదే టైంలో రైల్వే పోలీసులు పొట్టిమామ వివరాలు తెలుసుకుని  సొంతూరుకు పంపించారట.

ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే రవీంద్ర నాన్నగారు చనిపోయారట. దీంతో రవీంద్ర పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఉన్న ఊర్లోనే అనాథగా మారిపోయాడు. ఇక బతకడం కోసం బార్‌లో పనికి కుదిరితే అక్కడా తనలోని  సినిమా పిచ్చి కుదురుగా ఉండనివ్వలేదట. కానీ అదై టైంలో తన మేనత్త కూతురుని పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్లాల్సి వచ్చిందట. అప్పటి  నుంచి పొట్టి మామ జీవితం ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అన్న చందంగా మారిపోయిందిట. అన్నట్టు పొట్టి మామకు ముగ్గురు కొడుకులు. దీంతో రవీంద్ర తనలోని  సినిమా ఆశలన్నీ చంపుకుని గొర్లు కాస్తూ బతికుతున్నాడట.

కాలం ఎవరికైనా రెండో చాన్స్‌ ఇస్తుంది అన్నట్టు 57 ఏళ్ల పొట్టి మామకు ప్రజ్వల్‌ పరిచయంతో జీవితమే మారిపోయింది. అప్పుడప్పుడే యూట్యూబ్‌ గురించి తెలుసుకున్న ప్రజ్వల్‌ తన సెల్‌ఫోన్‌తో పొట్టిమామతో కలిసి ఒక కామెడీ స్కిట్‌ చేశాడు. అది సూపర్‌ హిట్‌ కావడంతో ఇక పొట్టిమామ, ప్రజ్వల్‌ వెనక్కి తిరుగి చూసుకునే చాన్స్‌ రాలేదట. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి 33 కామెడీ స్కిట్స్‌  ‌చేశారు. అవన్నీ హిట్టే దీంతో ఏదైనా వెరైటీగా చేయాలని అందరూ తమ వైపే అట్రాక్ట్‌ అయ్యేలా చేయాలనే ఆలోచనలోంచి పుట్టికొచ్చిందే కవర్‌ సాంగ్స్‌. ఈ కవర్‌ సాంగ్స్‌ ఐడియా అదిరిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్‌ చేసినా సూపర్‌ హిట్టే..ఈ కవర్‌ సాంగ్సే  పొట్టిమామను యూట్యూబ్‌ మెగాస్టార్‌ గా నిలబెట్టాయి.  ఆయన చేసిన చిరంజీవి హిట్‌ సాంగ్స్‌ కు మిలయన్ల వ్యూస్‌ వచ్చాయి. అన్నట్టు పొట్టి మామ కూడా మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజే ఆగస్టు 22 వ తేదీన పుట్టాడట.

ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగిన పొట్టిమామ ఇంటికే ఇప్పుడు అవకాశాలు షూస్‌ వేసుకుని క్యూ కడుతున్నాయట. తాజాగా ఆయన రాంచరణ్‌ అప్‌కమింగ్‌ మూవీలో నటిస్తున్నట్టు సమాచారం.

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×