Toothache Home Remedies: పంటి నొప్పి భరించలేని అనుభవం. ఇది నోటికే పరిమితం కాకుండా తల, దవడ , చెవులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నొప్పి అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. అంతే కాకుండి కొన్నిసార్లు నిద్రలేని రాత్రులకు కూడా కారణమవుతుంది. తరచుగా ఈ సమస్య క్షయం, ఇన్ఫెక్షన్, చిగుళ్ళ వాపు లేదా నరాల దెబ్బతినడం వల్ల వస్తుంది.
ఇలాంటి సమమంలో మీరు డాక్టర్ ను సంప్రదించడానికి ముందుగా కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం ముఖ్యం. కొన్ని రకాల హోం రెమెడీస్ నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
పంటి నొప్పి నుండి ఉపశమనం పొందడానికి 5 హోం రెమెడీస్:
లవంగం నూనె:
లవంగాలలో యూజినాల్ ఉంటుంది. ఇది సహజ నొప్పి నివారిణి, అంతే కాకుండా క్రిమినాశక మందు. లవంగాల నూనెను ఒక కాటన్ బాల్ పై రాసి, నొప్పిగా ఉన్న పంటిపై కొన్ని నిమిషాలు ఉంచండి. ఇది వాపును తగ్గిస్తుంది. అంతే కాకుండా నొప్పి నుండి త్వరగా ఉపశమనం ఇస్తుంది. లవంగా నూనె అందుబాటులో లేకపోతే.. లవంగాలను నమలడం కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
సాల్ట్ వాటర్ రిన్స్:
గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా నశించి వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ హోం రెమెడీ నొప్పిని తగ్గించడమే కాకుండా చిగుళ్ళను శుభ్రంగా ఉంచుతుంది. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. నొప్పి నుండి ఈజీగా బయటపడేందుకు అవకాశం కూడా ఉంటుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడకం:
3% హైడ్రోజన్ పెరాక్సైడ్ ను సమాన పరిమాణంలో నీటితో కలిపి పుక్కిలించండి. ఇది ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. అంతే కాకుండా పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని ఉపయోగిస్తున్నప్పుడు అస్సలు మింగకూడదు. ఇన్ఫెక్షన్ కారణంగా నొప్పి వచ్చినప్పుడు ఈ పరిహారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని తరచుగా వాడటం వల్ల కూడా నొప్పి తొందరగా తగ్గుతుంది.
కోల్డ్ కంప్రెస్:
పంటి నొప్పి వాపు వల్ల వస్తే, ఐస్ కంప్రెస్ గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. ఐస్‌ను ఒక గుడ్డలో చుట్టి.. చెంప వెలుపల ప్రభావిత ప్రాంతంపై 15-20 నిమిషాలు అప్లై చేయండి. ఇది నరాలకు మేలు చేస్తుంది. వాపును తగ్గిస్తుంది. తరచుగా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఐస్ నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
Also Read: ఈ ఆయుర్వేద పదార్థాలు వాడితే.. 50 ఏళ్లయినా జుట్టు అస్సలు రాలదు
పసుపు పేస్ట్:
పసుపు యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు పొడికి కొంచెం నీరు లేదా తేనె కలిపి పేస్ట్ లా చేసి ప్రభావితమైన పంటి లేదా చిగుళ్ళపై రాయండి. ఇది ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో, నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. క్రమం తప్పకుండా దీనిని ఉపయోగించడం వల్ల దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.అంతే కాకుండా ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.