Bizarre Divorce Case: కొన్ని సార్లు లాయర్ల వద్దకు వెరైటీ కేసులు వస్తుంటాయి. ఆ కేసులు చూసి, నవ్వుకొనే పరిస్థితి ఉన్నా, ఎదుటి వారి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని లాయర్లు ఆ కేసులను వాదిస్తుంటారు. అలాంటి కేసే ఇది. అయితే ఇది ఓ లాయర్ కు ఓ వ్యక్తి అడిగిన సందేహం. ఈ సందేహానికే ఆ లాయర్ కు ఫ్యూజులు పోయాయి. అంతలా ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి లాయర్ ఇచ్చిన సలహా ఏమిటో తెలుసుకుందాం.
దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని అందరూ కోరుకుంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం అనేది కీలకం. జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని, ముందుకు సాగాల్సిన పరిస్థితి వైవాహిక జీవితంలో ఉంటుంది. ఇటు భర్త, అటు భార్య ఇద్దరూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తేనే ఆ సంసారం సాఫీగా సాగిపోతుంది. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాల వల్ల నిండు నూరేళ్ల సంసారం సగంలోనే ముగింపు పలుకుతుంది. అన్ని కుటుంబాల్లో ఇలా జరగకపోయినా, కొన్ని కుటుంబాల్లో విచిత్రమైన కారణాలతో విడాకుల వరకు వెళ్లడం ఇప్పుడు కామన్ గా మారింది.
న్యాయస్థానాలు కూడా వైవాహిక జీవితాన్ని నిలబెట్టేందుకు సమయం ఇవ్వడంతో పాటు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. చివరకు ఇక విడాకులు ఖాయమేనన్న పరిస్థితుల్లో ఇద్దరి అంగీకారంతో భార్యభర్తల అనుబంధానికి విడాకులు అనే గీత వస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఓ వ్యక్తి విడాకుల కోసం సుప్రీంకోర్టు లాయర్ సాయికృష్ణ ఆజాద్ ను ఒక సలహా కోరాడు.
లాయర్ సాయికృష్ణ ఆజాద్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఏవైనా సందేహాలు నివృతి చేస్తుంటారు. అలా ఆయనకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అదేమిటంటే.. తన భార్య స్నానం చేయదని, ఎప్పుడూ తన వద్ద చేపల వాసన వస్తుందని, వంట కూడా దారుణంగా ఉంటుందని అందుకు విడాకులు తీసుకోవచ్చా అంటూ కోరాడు. అలాగే మాట్లాడితే చనిపోతాను, లేకుంటే కేసు పెడతానని భయపెడుతుందని చెప్పుకొచ్చారు.
Also Read: Alekhya Chitti Pickles: ఇంత మోసమా.. అంతా ఫేమ్ కోసమే బూతులు.. రమ్యపై నెటిజన్స్ ఫైర్..
ఇదొక వింత కేసు అయినప్పటికీ లాయర్ ఆజాద్ కూడా చిరునవ్వులు చిందించి చిట్టచివరకు ఓ సలహా ఇచ్చారు. అయితే ఈ సలహా అందరికీ కాదని, దాంపత్య జీవితాలు ఆనందంగా ఉండాలన్నదే తన అభిమతమన్నారు. భర్త ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే, క్రూయాలిటీ గ్రౌండ్ కింద విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని లాయర్ సూచించారు. మరి లాయర్ ఇచ్చిన సలహాతో ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? లేక తన భార్యకు సమస్యను కూలంకషంగా వివరించి సమస్యను పరిష్కరించుకుంటారా అన్నది విషయం వెలుగులోకి వస్తే కానీ, తెలిసే అవకాశం ఉంది.