Mythri movie makers : ఒక భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించడం ఒక ఎత్తు అయితే. ఆ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా పుష్ప 2. ఇదివరకే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. మొదటి ఈ సినిమాకి తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. చాలామంది సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్, పొలిటికల్ లీడర్స్ ఈ సినిమాలోని డైలాగులను విపరీతంగా వాడటం వలన ఈ సినిమా ఇంకా ఫేమస్ అయ్యింది. అలానే ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పటివరకు ఏ తెలుగు యాక్టర్ కి నేషనల్ అవార్డు రాలేదు. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న పుష్ప సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీమియర్ షోస్ నేటి నుంచి మొదలుకానున్నాయి.
ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోస్ చాలా చోట్ల క్యాన్సిల్ చేశారు. ఈ సినిమాకి మంచి ప్రమోషన్ చేశారు కానీ గ్రౌండ్ లెవెల్ లో సినిమా డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చేయలేకపోయారని చెప్పాలి. అయితే హైదరాబాద్ మెయిన్ థియేటర్ ప్రసాద్ లో కూడా ఈ సినిమా ఉంటుందో ఉండదో ఇప్పటికీ క్లారిటీ లేదు. మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో చాలా వెనకబడి ఉంది. ఒక ప్లానింగ్ లేదు, విజన్ లేదు. టికెట్ రేట్స్ విపరీతంగా పెట్టేసారు.చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ అవుతున్నాయి. దేవర అనే సినిమాను నాగ వంశీ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో 528 కు పైగా 1Am షోస్ వేయించాడు. సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ సినిమా చాలా రిస్క్ అమౌంట్ కి కొన్నాడు వంశీ. కానీ వంశీ ప్లానింగ్ వలన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామందికి ఈ సినిమా రీచ్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టి మంచి కలెక్షన్స్ కట్టబెట్టారు.
ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే చాలాచోట్ల టికెట్స్ అంతగా తెగట్లేదు. దీనికి కారణం ఆ సినిమా టికెట్లు కు ఉన్న రేటు అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే సామాన్య ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం ఆల్మోస్ట్ మానేశారు. ఎప్పుడూ ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా చూడడానికి థియేటర్ కి వస్తారు. అటువంటి తరుణంలో కూడా పెద్ద సినిమా టికెట్ కాస్ట్ పెద్ద రేంజ్ లో ఉంటే సినిమా చూడడానికి ఇష్టపడరు. చాలాచోట్ల ఈ సినిమా క్యాన్సిల్ అవుతున్నట్లు ట్విట్టర్ వేదిక పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంటుందని చాలామంది ఊహిస్తున్నారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి సినిమా రికార్డును కూడా బ్రేక్ చేస్తుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Megastar Chiranjeevi : శ్రీకాంత్ కంటే అనిల్ ముందు