Hansika Nasanally: మోడల్స్‌గా తమ కెరీర్‌ను ప్రారంభించిన ప్రతీ అమ్మాయి.. ఏదో ఒక బ్యూటీ పోటీలో పాల్గొని, కిరీటం గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. చాలామంది తెలుగుమ్మాయి కూడా మోడలింగ్ ఫీల్డ్‌లో ఉన్నా.. అందులో చాలా తక్కువమందికే కిరీటాలు దక్కాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మరొక తెలుగమ్మాయి చేరింది. తనే హన్సిక నసనల్లి. ఇటీవల జరిగిన నేషనల్ ఆల్ అమెరికన్ మిస్ పోటీల్లో పాల్గొన్న హన్సిక.. విన్నర్‌గా నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది. దీంతో తన సంతోషానికి హద్దులు లేవు. హన్సిక ఆల్ అమెరికన్ మిస్ పోటీల్లో గెలిచిన ఫోటోలు వైరల్ అవ్వగా ఈ విషయం తెలిసిన నెటిజన్లు తనకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
ఎన్నో అవార్డులు
హన్సిక నసనల్లి (Hansika Nasanally) ఒక తెలుగమ్మాయి. నేషనల్ ఆల్ అమెరికన్ మిస్ జ్యూనియర్ టీన్ కేటగిరిలో తను విన్నర్‌గా నిలిచి కిరీటం గెలుచుకొని తెలుగువారు అందరూ గర్వపడేలా చేసింది. 50 రాష్ట్రాల నుండి వచ్చిన 117 కంటెస్టెంట్స్‌తో పోటీపడి తను విన్నర్‌గా నిలిచింది. తన విజయానికి తన టాలెంట్, గ్రేస్, డెడికేషనే కారణమని సన్నిహితులు అంటున్నారు. అయితే ఇది హన్సిక మొదటి విజయం కాదు.. గత రెండేళ్లుగా తను ఎన్నో బ్యూటీ పోటీల్లో పాల్గొంది. తను నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో రెండేళ్లు వరుసగా విన్నర్‌గా నిలిచింది. అకాడమిక్స్‌లో తన ప్రతిభను గుర్తించి అకాడమిక్ అచీవ్మెంట్ అవార్డ్ కూడా దక్కింది. తన స్టైల్, కాన్ఫిడెన్స్‌ను చూసి తనకు క్యాషువల్ వేర్ మోడల్ విన్నర్ అవార్డ్ కూడా ఇచ్చారు.
Also Read: పెళ్లిపీటలు ఎక్కబోతున్న మరో కుర్ర హీరో.. వధువు ఎవరంటే.. ?
భరతనాట్యం డ్యాన్సర్
హన్సిక నసనల్లి కేవలం ఒక మోడల్ మాత్రమే కాదు.. తను ఈ బ్యూటీ పోటీలు కాకుండా మరెన్నో రంగాల్లో తన టాలెంట్ నిరూపించుకుంది. తను ఒక భరతనాట్యం డ్యాన్సర్. చిన్న వయసు నుండే తనలోని స్కిల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది హన్సిక. గత ఆరేళ్లలో తను బ్యూటీ పోటీల్లో గెలుచుకున్న అవార్డులే తన డెడికేషన్‌కు ఉదాహరణగా నిలిచాయి. హన్సిక.. నేషనల్ అమెరికా మిస్ విన్నర్ కిరీటాన్ని గెలవడం కంటే ముందే ఇంటర్నేషనల్ జూనియర్ మిస్, ఐఏఎమ్ పేజెంట్ పవర్‌హౌస్ పోటీల్లో కూడా సక్సెస్ సాధించింది. వనపర్తికి చెందిన హన్సిన నసనల్లి.. చదువుతో పాటు ఆర్ట్స్‌కు విలువిచ్చే కుటుంబంలో పెరిగింది. తన తల్లి ప్రశాంతిని కూడా ప్రముఖ భరతనాట్యం డ్యాన్సర్‌తో పాటు నటి కూడా.
మెడిసిన్ చదవాలి
కన్నడ, తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కుమార్తె హన్సిక. ఇప్పటికే ఆల్ అమెరికన్ మిస్ పోటీల్లో పాల్గొని గెలిచిన హన్సిక.. తన తరువాతి టార్గెట్ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాలే అని చెప్తోంది. ఒకవైపు బ్యూటీ పోటీలపై దృష్టిపెడుతూనే.. మరొకవైపు బ్రౌన్, హార్డ్వర్డ్, స్టాన్ఫార్డ్ లాంటి యూనివర్సిటీల్లో మెడిసిన్ చదవడం తన కల అని బయటపెట్టింది. హన్సిక నసనల్లి డెడికేషన్ చాలామంది యంగ్ అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్ అని తనను ప్రశంసిస్తున్నారు. 117 కంటెస్టెంట్స్ మధ్య తను ఈ కిరీటాన్ని గెలవడం సంతోషంగా ఉందని హన్సిక నసనల్లి పోస్ట్ చేసింది.