Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు, మెగా ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెల్సిందే. వీరి మధ్య విభేదాలు ఉన్నాయని ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న మాటనే. కానీ, ఈ ఏడాది ఎలక్షన్స్.. ఈ రెండు కుటుంబాల మధ్య వున్న విభేదాలను బయటపడేలా చేసింది. మెగా ఫ్యామిలీ నుంచి బయటకి వచ్చి తనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ ను ఏర్పర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు బన్నీ. ఇది అందరికీ తెల్సిందే. అందులో బన్నీ సక్సెస్ కూడా అయ్యాడు.
ఇక ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ వచ్చాయి. జనసేన, టీడీపీ పొత్తులో పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నా అని ఒక ట్వీట్ వేసిన బన్నీ.. తదుపరి రోజే.. వైసీపీ నేతకు సపోర్ట్ గా ఉండడానికి వారి ఇంటికి వెళ్ళాడు. అయితే స్నేహం కోసం ఆ పని చేయాల్సి వచ్చింది అని అల్లు అర్జున్ చెప్తున్నా.. ముందు కుటుంబం.. ఆ తరువాతే కదా ఫ్రెండ్స్. అది కూడా బన్నీ క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు. అతని భార్య.. బన్నీ భార్య ఫ్రెండ్స్. ఆ ఫ్రెండిష్ కోసం.. కుటుంబాన్ని వదిలి ఎలా వెళ్తావ్ అని ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆ ఒక్క ఇన్సిడెంట్.. ఇప్పటివరకు కలిసి ఉన్న మెగా – అల్లు కుటుంబాలను మరింత దూరం చేసింది.
Seize The Ship: ఇదెక్కడి అరాచకంరా మావా.. ఆయన డైలాగే టైటిల్ అంట.. ?
ముఖ్యంగా మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ చేసిన పనికి అయితే ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. ఆ ఇన్సిడెంట్ తరువాత తేజ్.. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో బన్నీ అన్ ఫాలో చేశాడు. దీంతో మెగా కుటుంబంలో ప్రకంపనలు రేగినట్లు వార్తలు వచ్చాయి. ఇక దీంతో మెగా ఫ్యాన్స్.. అల్లు ఫ్యాన్స్ నుంచి విడిపోయారు. పుష్ప 2 సినిమాకు ఇదే పెద్ద మైనస్ అనే చెప్పాలి. మెగా కాంపౌండ్ నుంచి వచ్చాడు కాబట్టే.. బన్నీని మెగా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆ ఎలక్షన్స్ తరువాత అంతా మారిపోయింది.
రేపు పుష్ప 2 రిలీజ్. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురుచూసిన మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు ఈ సినిమాకు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మెగా మేనల్లుడు తేజ్ కు ఉన్న ఒక గొప్ప అలవాటు ఏంటి అంటే.. ఏ సినిమా రిలీజ్ అయినా.. దానికి ముందు రోజు సోషల్ మీడియాలో ఆ సినిమాకు బెస్ట్ విషెస్ చెప్తాడు. అది చిన్న సినిమానా.. ?పెద్ద సినిమానా.. ? డబ్బింగ్ సినిమానా.. ? ఇవేమి చూడడు.
Bigg Boss8 Telugu : బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ఎప్పుడు? గెస్టులు ఎవరంటే?
ఇక రేపు పుష్ప 2 రిలీజ్.. బన్నీతో ఉన్న విభేదాల వలన సినిమాకు బెస్ట్ విషెస్ చెప్తాడా.. ? లేదా.. ? అని ఫ్యాన్స్ అందరు ఎంతగానో ఎదురుచూసారు. చివరకు తేజ్.. వ్యక్తిగత విషయాలను మనసులో పెట్టుకోకుండా సినిమా పరంగా పుష్ప 2 చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశాడు. “పుష్ప 2 చిత్రబృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్, ఫహాద్ ఫాజిల్ మరియు ఈ చిత్రంలో నటించిన వారందరికీ మనస్ఫూర్తిగా మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చాడు.
Bellamkonda Srinivas: పెళ్లిపీటలు ఎక్కబోతున్న మరో కుర్ర హీరో.. వధువు ఎవరంటే.. ?
ఇక బన్నీ సైతం.. తేజ్ విషెస్ కు రిప్లై ఇచ్చాడు. ” చాలా ధన్యవాదాలు తేజు. మీ సోదర శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. కౌగిలింతలు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే స్పెషల్ గా బన్నీ.. మీ అందరికీ సినిమా నచ్చుతుంది అంటే.. మెగా ఫ్యామిలీ గురించి చెప్తున్నాడా.. ? మెగా ఫ్యాన్స్ కు చెప్తున్నాడా.. ? అనేది క్లారిటీ లేదు. ఏదిఏమైనా.. వీరిద్దరూ ఇలా మాట్లాడుకోవడం మాత్రం ఫ్యాన్స్ దిల్ కుష్ చేస్తుంది. మరి ఈ సినిమాతో బన్నీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Thank you very much Teju . Thank you for your brotherly wishes 🖤 . I hope you all like the movie . Hugs !
— Allu Arjun (@alluarjun) December 4, 2024