Chiranjeevi: టాలీవుడ్ లో కుటుంబ కథా చిత్రాలకు ఆదరణ ఎక్కువగా లభిస్తుంది. చిన్నా పెద్ద కుటుంబంతో కలిసి ఈ సినిమాలను ఎంజాయ్ చేస్తారు. తాజాగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈకోవకు చెందింది. అలనాటినటుల నుండి ఈ తరం హీరోల వరకు ఈ జోనర్ లో సినిమాలు తీస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటున్నారు. 1984లో ఇంటిగుట్టు అనే సినిమా ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. హీరోగా చిరంజీవి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవికి ఈ సినిమాతో టాలీవుడ్ లో తన స్థానాన్ని మరో మెట్టు ఎక్కించారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో ముందుగా హీరో పాత్రను చిరంజీవి కాకుండా మరో బడా హీరోని అనుకున్నట్లు, ఆయనను తప్పించి చిరంజీవిని ఆ సినిమాలో హీరోగా ఎందుకు తీసుకున్నారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అందుకే తప్పించారా ..
1984లో చిరంజీవి హీరోగా, కే బాపయ్య దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇంటిగుట్టు. ఈ సినిమాలో నళిని, సుహాసిని హీరోయిన్స్ గా నటించారు. చంద్రమోహన్, అల్లు రామలింగయ్య, రావు గోపాల్, కైకాల సత్యనారాయణ వంటి ప్రముఖులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో చిరంజీవి నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఈ సినిమాలో మొదటగా మోహన్ బాబుని హీరోగా తీసుకొని సినిమాని మొదలుపెట్టారు. కొంత షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత, ఒకరోజు బాపయ్య గారితో మోహన్ బాబు మాట్లాడడానికి వెళ్ళగా.. ఆయన కొంత సమయం వేచి ఉండమని, మోహన్ బాబు ని ఎదురుచూసేలా చేశారు. అది నచ్చని మోహన్ బాబు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బాపయ్య గారు కొంత సేపటి తరువాత మోహన్ బాబుని కలవడానికి వెళితే.. అప్పటికే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలిసిందిట. దానికి కోపంతో బాపయ్య గారు మోహన్ బాబుని ఈ సినిమా నుండి తొలగించి చిరంజీవిని అప్పటికప్పుడు హీరోగా ప్రకటించారు.
ఫామిలీ స్టార్ గా మెగా స్టార్ ..
నిర్మాతలు మొదట ఒప్పుకోకపోయినా బాపయ్య గారు నిర్మాతలను ఒప్పించి, ఈ సినిమాలో చిరంజీవిని హీరోగా తీసుకున్నారు. దర్శకుడికి చెప్పకుండా, షూటింగ్స్ పార్ట్ నుంచి అలా మోహన్ బాబు వెళ్లడంతో ఈ సినిమాని మిస్ అయ్యారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చారు. ఇటువంటి కుటుంబ కథా చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉన్నాయి.అటువంటి చిత్రాలలో డాడీ, ఘరానా మొగుడు, విజేత,పసివాడి ప్రాణం శుభలేఖ, వంటి కుటుంబ చిత్రాలు చిరంజీవిని మెగాస్టార్ గా చేశాయి చిరంజీవి ఇంటిగుట్టు సినిమా అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకుల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించారు.
Karan Johar: నా వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే.. మీరు ఫాలో అవ్వండన్నా కరణ్ జోహార్