జస్టిస్ గవాయ్ 2019, మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.జస్టిస్ బి.ఆర్.గవాయ్ సీజేఐగా బాధ్యతలను చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతిలో 1960, నవంబర్ 24న జన్మించారు. నాగ్ పూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సెల్గా పనిచేశారు.
జస్టిస్ BR గవాయ్ 1992, ఆగస్టు నుంచి 1993, జులై వరకూ బాంబే హైకోర్టు నాగుర్ ధర్మాసనంలో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సేవలందించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ 2000, జనవరి 7న హైకోర్టు నాగ్పూర్ ధర్మాసనంలో ప్రభుత్వ న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. 2005, నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. అక్కడి నుంచి ఒక్కోమెట్టు ఎక్కుతూ చీఫ్ జస్టిస్ స్థాయికి చేరుకున్నారు.
నేడు పదవీ విరమణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇటీవలే తనకు SCAORA ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడారు. తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని చెప్పగలిగే డ్రాఫ్టింగ్ కళపై పట్టు సాధించలేకపోవడం ఇంకా తనకు లోటుగానే అనిపిస్తోందని సంజీవ్ ఖాన్నా తెలిపారు. క్లుప్లంగా ఉండే ఫైళ్లను చదవడం కూడా చాలా తేలికని చెప్పారు. ఫైల్ చదివిన తర్వాత ఆ కేసుపై సగం వరకు పట్టు దొరుకుతుందని జస్టిస్ ఖన్నాఅభిప్రాయపడ్డారు.
Also Read: నెక్స్ట్ సీఎం మీరే..! నాంచారమ్మ జాతరలో సోది జోస్యం చెప్పించుకుంటున్న కవిత
సీనియర్లపై ఆధారపడకుండా కోర్టుల్లో కేసులను వాదించాలని న్యాయవాదులకు సూచించారు. సంబంధిత విషయ పరిజ్ఞానం కలిగి ఉండటం లాయర్లకు ఎంతో ముఖ్యమైన విషయమని చెప్పారు. రిటైరయ్యాక సాయం కావాల్సిన వారు మొహమాటం లేకుండా తన వద్దకు రావచ్చని, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పిలుపునిచ్చారు.