Garividi Lakshmi 1st Single: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. ఈ బ్యానర్ ఇప్పటివరకు దాదాపు 40 సినిమాలు పైగా పూర్తి చేసుకుంది. అయితే ఈ బ్యానర్ కి సక్సెస్ రేట్ కంటే కూడా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా క్వాలిటీ కంటే క్వాంటిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు నిరూపిస్తూ వచ్చాయి. ప్రస్తుతం మీ బ్యానర్ లో గరివిడి లక్ష్మి అనే ఒక సినిమా జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ ఈవెంట్ భారీ స్థాయిలో చేశారు నిర్మాతలు. ఈ సినిమాతో గౌర నాయుడు జమ్ము అనే ఒక కొత్త దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
తెలుగు తమిళ్ భాషల్లో మంచి గుర్తింపు సాధించుకున్న ఆనంది ఈ సినిమాలో గరివిడి లక్ష్మి పాత్రను పోషిస్తుంది. అలానే సినిమా బండి, కీడా కోలా వంటి సినిమాలతో మంచి గుర్తింపు సాధించుకున్నా రాగ మయూర్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అలానే నరేష్, రాశి వంటి సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారుని గరివిడి లక్ష్మి యదార్ధ జీవిత సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. టీవీలు తక్కువగా ఉన్న రోజుల్లో బుర్రకథలకు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎంత పెద్ద ప్రాధాన్యత ఉండేదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న జనరేషన్ కి బుర్రకథలు గురించి తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు జనరేషన్ అంతా బుర్రకథలకి ఊగిపోయేవాళ్ళు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గరివిడి లక్ష్మి బాగా ఫేమస్. అదే కథను ఇప్పుడు వెండితెరపైకి తీసుకొస్తున్నారు.
అప్పట్లో ఈమె పాడిన పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇక ప్రస్తుతం గరివిడి లక్ష్మి సినిమా నుంచి మొదటి సింగిల్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. నల జిలకర మొగ్గ అనే లిరిక్ తో స్టార్ట్ అయిన ఈ పాట వినడానికి బాగుంది. రీసెంట్ టైమ్స్ లో ఫ్లోక్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. కోటబొమ్మాలి, పలాస వంటి సినిమాలలో ఫ్లోక్ సాంగ్స్ ఎంతగా ప్రాచుర్యం పొందాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్లీ గరివిడి లక్ష్మి సినిమాలో పాటలు అదే స్థాయిలో ఉండబోతున్నాయి అని చెప్పొచ్చు. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ కన్నడ సింగర్ అనన్య బట్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరలో ఆదోని లో మొదలుకానుంది.