Kollywood 2024:మరో మూడు వారాలు గడిస్తే 2024 సంవత్సరం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పొడవున కోలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి? ఎవరు బాక్సాఫీస్ కింగ్ గా నిలిచారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇక 2024లో అత్యధిక వసూలు సాధించిన తమిళ సినిమాలు ఏంటి? అనే విషయం కూడా అభిమానులు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. ఇకపోతే 2024 లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న టాప్ 5 తమిళ సినిమాల జాబితా ఇప్పుడు వైరల్ గా మారింది.
గత ఏడాది జైలర్, లియో సినిమాలు రూ.600 కోట్లకు పైగా వసూలు చేసి మాస్ రికార్డు క్రియేట్ చేశాయి. అయితే ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రూ.500 కోట్ల మార్కు దాటకపోవడం గమనార్హం. ఇక ఈ ఏడాది కూడా తమిళ సినిమా రూ.1000కోట్ల వసూళ్ల కళ కలగానే మిగిలిపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. ది గోట్ – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం:
2024 లో తమిళ సినిమాగా విడుదలై అత్యధిక వసూలు సాధించిన చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. దళపతి విజయ్ (Vijay thalapathy)నటించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు(Venkat Prabhu)దర్శకత్వం వహించగా.. ఇందులో స్నేహ, మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ లో వినాయక చవితి సందర్భంగా విడుదలవగా.. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించారు. అయితే బాక్సాఫీస్ వద్ద రూ.450 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.
2. అమరన్:
ప్రస్తుతం బాక్సాఫీస్ కింగ్ గా నిలిచారు శివ కార్తికేయన్ (Shiva Karthikeyan). శివ కార్తికేయన్, సాయి పల్లవి(Sai Pallavi)ప్రధాన పాత్రలు పోషిస్తూ తెరకెక్కిన చిత్రం ఇది. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమా దీపావళికి విడుదలై రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
3. వేట్టయాన్:
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లాల్ సలాం వేట్టయాన్ చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. లాల్ సలాం సినిమా ఘోర పరాభావాన్ని అందుకోగా వేట్టయాన్ సినిమాలు ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం అక్టోబర్లో విడుదల అయింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్ల రూపాయలు వసూల్ చేసింది.
4. రాయన్:
2024లో నటుడు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన చిత్రమిది. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం కూడా వహించారు. ఆయన 50 వ చిత్రంగా వచ్చిన దీన్ని సన్ పిక్చర్స్ వారు నిర్మించారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.160 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
5. మహారాజా:
విజయ్ సేతుపతి 50 వ సినిమాగా విడుదలైన ఈ సినిమా జూన్లో వచ్చింది. నితిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ. 110 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు చైనాలో 40 వేల థియేటర్లలో విడుదలై, అక్కడ కూడా వసూలు రాబట్టింది. ఇక మొత్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.