BigTV English
Advertisement

Pushpa 2: ప్రొడ్యూసర్స్ అత్యాశే ప్రసాద్స్ లో సినిమా లేకుండా చేసింది

Pushpa 2: ప్రొడ్యూసర్స్ అత్యాశే ప్రసాద్స్ లో సినిమా లేకుండా చేసింది

Pushpa 2: కొన్నిసార్లు చెప్పే మనిషి వినే టైం వలన విషయం విలువే మారిపోద్ది అంటుంటారు. అలానే చూసే ప్లేసు థియేటర్ వలన కూడా సినిమా మీద ఒపీనియన్ మారుతూ ఉంటుంది. కొన్ని డొక్కు థియేటర్స్ లో సినిమాలు చూడడం కంటే, ప్రసాద్స్ లో సినిమా చూడటం అనేది చాలా బెటర్ అని హైదరాబాద్ లో ఉన్న చాలామంది సినిమా ప్రేమికులు అనుకుంటారు. వేరేచోట్ల థియేటర్స్ అవైలబుల్ గా ఉన్నా కూడా ప్రసాద్ థియేటర్ కెళ్ళి సినిమా చూడటం అనేది ఒక ఆనవాయితీగా కొందరు మార్చుకుంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ప్రతి సినిమా అక్కడ ఖచ్చితంగా ఆడుతుంది. అయితే తెలుగులో భారీ బడ్జెట్ తో వస్తున్న పుష్పా సినిమా అక్కడ ఆడుతుందా లేదా అనే క్లారిటీ ఇప్పటివరకు రాలేదు. ప్రసాద్ థియేటర్స్ లో టికెట్స్ పెడితే చూడటానికి చాలామంది ఎదురుచూస్తున్నారు.


Also Read : Mythri movie makers : గ్రౌండ్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్ అంటే నాగ వంశీ ను చూసి నేర్చుకోవాలి

పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సినిమాకి సీక్వల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పుష్ప (Pushpa) సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా మంచి అంచనాలను పెంచుతుంది. అయితే చాలామంది సెలబ్రిటీస్ పుష్ప సినిమాను ప్రసాద్ థియేటర్స్ లో చూద్దామని ఎదురుచూస్తున్నారు. కానీ అక్కడ పుష్ప సినిమా ఆడుతుందో లేదో క్లారిటీ ఇప్పటికీ రాలేదు. వాస్తవానికి ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మునుపెన్నడూ లేని విధంగా ప్రీమియర్ షోస్ తో కలిపి 48 షోలు వేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ ఇదే జరిగి ఉంటే ప్రసాద్ చరిత్రలోనే ఇది ఒక హిస్టరీగా చెప్పాలి. కానీ ప్రొడ్యూసర్స్ (Mythri Movie Makers) డబ్బులు విషయంలో అత్యాశ పడటం వల్లనే ఇది ఆగిపోయినట్లు తెలుస్తుంది. అలానే ఎక్కువ పర్సంటేజ్ ను డిమాండ్ చేసినట్లు సమాచారం వినిపించింది. టికెట్స్ ని కూడా ఆన్లైన్లో ఇవ్వకూడదు అనేటట్లు తెలిపినట్లు తెలుస్తోంది.


Also Read : Nagachaithanya – Sobitha Wedding : ఆహా.. నాగార్జున ఇంట విందు.. అతిథులకు బహు పసందు..

ఏదేమైనా పుష్ప సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి అన్నమాట వాస్తవం. ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచుతుంది అని చాలామంది ఊహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక ప్రాపర్ రిలీజ్ ఇస్తే సినిమాకు మంచి ప్లస్ అవుతుంది. అద్భుతమైన కంటెంట్ ప్రజెంట్ చేసి, అలానే బీభత్సమైన ప్రమోషన్స్ చేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్ రిలీజ్ లేకపోతే సినిమాకి మైనస్ అవుతుంది. ఇంక చాలాచోట్ల ఈ సినిమాకి సంబంధించిన షోస్ కూడా క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఫలితం నేడు తెలియనుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పలుచోట్ల మొదలవ్వనున్నాయి. ఈ సినిమాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నేడు అల్లు అర్జున్ చూడనున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×