BigTV English

Tollywood Movie Shooting Updates: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా..?

Tollywood Movie Shooting Updates: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా..?

Tollywood Movie Shooting Updates: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి అయితే ఏ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని తమ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం కొత్త సినిమాలు తమ హీరోలు ఏవైనా చేస్తున్నారా? ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు? మరి సినిమాలలో ఏ హీరోయిన్ నటిస్తున్నారు? ఇలాంటివి తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆత్రుత కనబరుస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు? ఏ మూవీ షూటింగు ఎక్కడ జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం..


ప్రభాస్ – రాజాసాబ్ :

స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ వరుస లైనప్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఆయన ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ‘ రాజా సాబ్ ‘ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అజిజ్ నగర్ లో జరుగుతోంది.


ప్రభాస్ – ఫౌజీ:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో ఫౌజీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నది. ఇటలీ నుంచి వచ్చిన ప్రభాస్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్నారు. ప్రస్తుతంసినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది..

చిరంజీవి- అనిల్ రావిపూడి: 

ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ మొయినాబాద్ లో జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ – ఓజీ: 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్నా మూవీ ఓజీ.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఓజి సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది.

బాలకృష్ణ – అఖండ 2:

బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘అఖండ’. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని , బాలకృష్ణకు ఊహించని విజయాన్ని అందించింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ అఖండ 2 తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియా దేశంలో జరుగుతుంది.

రవితేజ – మాస్ జాతర :

ప్రస్తుతం రవితేజ , భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జానవాడలో జరుగుతుంది.

సాయి ధరంతేజ్ – సంబరాల ఏటిగట్టు :

ప్రముఖ హీరో సాయి ధరంతేజ్ హీరోగా ‘హనుమాన్’మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం సంబరాల ఏటిగట్టు. ప్రస్తుతం ఈ షూటింగ్ తుక్కుగూడ లో జరుగుతుంది..

తేజ సజ్జ – మిరాయ్:

హనుమాన్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టేటస్ ని సొంతం చేసుకున్న చైల్డ్ ఆర్టిస్టు తేజ .. ప్రస్తుతం మిరాయ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగు అజీజ్ నగర్ లో జరుగుతోంది.

విశ్వక్ సేన్ – ఫంకీ :

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ , అనుదీప్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఫంకీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది..

అక్కినేని నాగచైతన్య – NC 24 :

అక్కినేని నాగచైతన్య, ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఎన్సీ 24. ఇంకా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫైర్ స్టేషన్ దగ్గర జరుగుతోంది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×