BigTV English
Advertisement

DD Next level : వివాదంలో కోలీవుడ్ హీరో..సినిమాలోని పాటపై హిందువులు ఆగ్రహం..

DD Next level : వివాదంలో కోలీవుడ్ హీరో..సినిమాలోని పాటపై హిందువులు ఆగ్రహం..

DD Next level : కోలీవుడ్ స్టార్ హీరో సంతానం గురించి అందరికీ తెలుసు.. ఒకప్పుడు కమెడియన్ గా స్టార్ హీరోల సినిమాలో నటించిన ఈయన, ఈమధ్య హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా ఓ వివాదంతో సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాడు. హీరో అయ్యుండి ఇలాంటి పనిచేయడం ఏంటి అని ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. ఇంతకీ హీరో సంతానం ఏం చేశారు? ఆయనపై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు అందిందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..


హీరో సంతానం పై పోలీస్ కేసు..

కోలీవుడ్ హీరో సంతానం ప్రస్తుతం వార్తల్లో హైలైట్ అవుతున్నాడు. ఈయన నటించిన డీడీ నెక్ట్స్‌ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవింద పాటను పేరడీ చేశారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారిని అవమానించారంటూ బీజేపీ మండిపడుతోంది. సినిమాలో పాటను వెంటనే డిలీట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ వివాదం పై స్పందించిన మూవీ టీం దేవుడిపై పాడలేదని వివరణ ఇచ్చింది.. తిరుమల శ్రీవారిపై పేరడీ సాంగ్ ని రాయలేదని ప్రకటించింది. అలాగే తాను చేస్తున్న సినిమాపై సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరం తెలపలేదని క్లారిటీ ఇచ్చింది. నిజానికి సీని ఇండస్ట్రీ నిబంధనలు ప్రకారమే మేము సినిమాను తీస్తామని దీనిపై ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని హీరో సంతానం తాజాగా ఓ వీడియోలో తెలిపారు.. సినిమా పాటపై అభ్యంతం వ్యక్తం చేస్తూ తమిళనాడు సేలంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు..


మూవీ స్టోరీ విషయానికొస్తే..

ఈ సినిమాలో హీరో సంతానం ఒక రివ్యూవర్ గా పనిచేశారు.. ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు తిరుమల శ్రీవారి గోవింద నామాలను వాడారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలను ప్రజలు గొప్పగా భావిస్తుంటారు. ఆ నామాలలోనే శ్రీవారిని స్మరిస్తూ ఉంటారు. అలాంటి గోవింద నామాలను నెగిటివ్‌ సెన్స్‌లో వాడారనేది హిందూ సంఘాల అభ్యంతరం. సినిమాకి టికెట్ కొంటే పార్కింగ్ ఫీజ్‌ వేస్టు.. పాప్‌కార్న్‌ ట్యాక్స్‌ వేస్టు.. అంటూ.. ప్రతిదానికీ గోవింద అనే పదం యాడ్ చేసి ఈ వీడియో రిలీజ్ చేశారు.

Also Read :లోఫర్ నా** డకా… పాకీ కొడుకులను కించపరిచావురా.. మరోసారి రేగిన రచ్చ..

హీరో సంతానం రియాక్షన్.. 

ఈ వివాదం పై తాజాగా హీరో సంతానం స్పందించారు.. ఓ వీడియోలో మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన అంతవరకు సెన్సార్ రిపోర్టే ప్రధానం. దానికి విరుద్ధంగా మేము ఏ పని చేయలేదని ఆయన అంటున్నారు. దారినపోయే వాళ్లు చెబితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు హీరో సంతానం. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులోనూ విడుదల చేయబోతుంది యూనిట్. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×