Sree Vishnu New Movie : ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్ శ్రీ విష్ణు… ఈ ట్యాగ్‌ను ఆ యంగ్ ఎక్కడా పోగొట్టుకోవడం లేదు. ఇటీవల వచ్చిన సింగిల్ మూవీ… తన కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టింది. అలాగే నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ వచ్చేలా చేశాడు ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్ శ్రీ విష్ణు. మూడు రోజులకే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది అనే టాక్ కూడా వచ్చింది.
ఇలాంటి హీరోను నిర్మాతలు వదులుకుంటారా..? అందుకే గీతా ఆర్ట్స్ కూడా ఈ యంగ్ హీరోను వదులుకోవడానికి ఇష్టంగా లేదట. సింగిల్ మూవీ సక్సెస్ అవ్వడంతో మరో సినిమాను కూడా నిర్మించడానికి రెడీ అవుతుందట. అయితే ఈ సారి గీతా ఆర్ట్స్ లో కాకుండా.. జీఏ 2 లో శ్రీ విష్ణు మూవీ ఉండే ఛాన్స్ ఉంది.
డైరెక్టర్ ఎవరంటే..?
సింగిల్ సక్సెస్ అవ్వడంతో శ్రీ విష్ణుతో చాలా మంది డైరెక్టర్లు సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు. నిర్మాతలు కూడా అంతే. ఇప్పటికే కొంత మంది నిర్మాతలు శ్రీ విష్ణుకు అడ్వాన్స్ లు ఇచ్చినట్టు సమాచారం. ఆయా సినిమాలు ఇప్పుడు శ్రీ విష్ణు పూర్తి చేయాల్సి ఉంది. వీటితో పాటు అల్లు అరవింద్ కూడా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట.
గత ఏడాది ఆయ్ అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీని జీఏ 2 నే నిర్మించింది. దీనికి డైరెక్టర్ అంజి. ఆయ్ సినిమా కామెడీ కూడా బానే వర్కౌట్ అయింది. అంతే కాదు.. ఆ డైరెక్టర్ అంజికి కామెడీ సీన్స్ రాసే అనుభవం కూడా ఉంది. దీనికి తోడు ఆయనపై గీతా కంపౌండ్ కు మంచి నమ్మకం కూడా ఉంది. దీంతో శ్రీ విష్ణుతో చేయాలి అనుకుంటున్న మరో ప్రాజెక్ట్ ను ఆ అంజి చేతిలో పెట్టినట్టు తెలుస్తుంది.
సింగిల్ మూవీతో విమర్శలు..
సినిమా హిట్ అవుతుంది. కలెక్షన్లు బానే వస్తున్నాయి. ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. కానీ, శ్రీ విష్ణు డైలాగ్స్ వల్ల అల్లు అరవింద్ పై కొంత వరకు విమర్శలు వచ్చాయి అనే మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే… ఈ సినిమా ట్రైలర్ లో వచ్చిన కొన్ని డైలాగ్స్ పై చర్చ జరిగింది. అంతే కాదు… ఓ హీరో హర్ట్ అవ్వడమూ జరిగింది. దీంతో సినిమాపై కొంత వరకు విమర్శలు వచ్చాయి.
ఆడియన్స్ దాన్ని పాజిటివ్ గా తీసుకున్నా.. ఇండస్ట్రీ వర్గాల నుంచి మాత్రం అది లేదు. దీంతో ఆ డైలాగ్స్ సినిమా నుంచి తొలగించారు. దీంతో ఇలాంటి విమర్శలు వచ్చినా… శ్రీ విష్ణు ను గీతా కంపౌండ్ విడిచి పెట్టడం లేదు అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వస్తున్నాయి.