Kona Venkat : హీరోయిన్ అంజలితో తనకున్న రిలేషన్ ను మరోసారి బట్టబయలు చేశారు సినీ రచయిత కోనా వెంకట్. అంజలికి తనకు మధ్య మంచి రిలేషన్ ఉందని చెప్పాడు. ఓ ఇంటర్వూలో అంజలికి మీకు మధ్య ఏ విధమైన రిలేషన్ ఉందని అడగగా దానికి ఆయన ఘాటుగానే స్పందించాడు. అంజలిని మీరు చెల్లెలిలాగా ఫీల్ అయ్యి పిలవమంటే నేను చెల్లెమ్మ అని పిలుస్తానని కూతురులాగా పిలవమని చెబితే కూతురు లాగా చూసుకుంటానని ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యి పిలవమంటే ఓ మంచి మిత్రుడనని అన్నారు. తనకు నాకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని అది ఇప్పటిది కాదని చెప్పారు. సీతమ్మ వాకిట్లో సినిమా నుంచి తమ మధ్య మంచి బాండ్ కొనసాగుతుందని తెలిపాడు.
తన బాల్యం గురించి తెలిసిన వాడు ఎవ్వడైనా బాధ పడుతాడని చెప్పాడు. తనకి ఓ షోల్డర్ కావాలని అది నేను ఉంటానిని దానికి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అని చెప్పారు. సీతమ్మ వాకిట్లో అప్పటి నుంచే తనకు చెన్నైలో చాలా విధమైన వివాదాలు ఉన్నాయని.. తన ఆస్తులు అన్ని కబ్జా చేశారని తనకి ఎవ్వరూ లేరని అప్పటి నుంచి నేను తనతో కొనసాగుతున్నానని అండగా ఉంటున్నానని చెప్పారు. అందరూ అనుకునే విధంగా మా ఇద్దరి మధ్య అదేమి లేదని నేను అంత నీచుడని కాదని చెప్పాడు. తను ఓ గురువుగా నా దగ్గరకు వచ్చి కార్ ఓపెన్ చేయిస్తే అంతా తప్పుగా అనుకున్నారని మళ్లీ చెబుతున్నా ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అని చెప్పాడు.
కాగా, అంజలి కోనా వెంకట్ పై రూమర్స్ రావడమనేది ఈనాటిది కాదు.. కోనా దర్శకత్వంలో అంజలీ నటించిన ఫస్ట్ సినిమా గీతాంజలి నుంచే వారిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్స్ వచ్చాయి. వీటన్నిటి ఇది వరకే పలు మార్లు స్పందించిన కోనా.. ఇవాళ కొంచెం ఘాటుగా స్పందించారు. కాగా, ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వస్తున్నవి రూమర్సేనని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మంచి రిలేషన్ను బ్రేక్ చేయవద్దని చెడు అంటగట్టవద్ది పలువురు చెబుతున్నారు.