BigTV English

Koratala Siva: అప్పుడే ‘దేవర 2’ స్టార్ట్ చేస్తా.. కీలక అప్డేట్ ఇచ్చిన కొరటాల శివ

Koratala Siva: అప్పుడే ‘దేవర 2’ స్టార్ట్ చేస్తా.. కీలక అప్డేట్ ఇచ్చిన కొరటాల శివ

Koratala Siva: ఎంతోకాలంగా టాలీవుడ్‌లో రైటర్‌గా పనిచేస్తూ ఎన్నో హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు కొరటాల శివ. ఆ తర్వాత తానే ఒక డైరెక్టర్‌గా మారి సినిమాలు తెరకెక్కించడం మొదలుపెట్టారు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో హ్యాట్రిక్ కొట్టాడు. కానీ రెండేళ్ల క్రితం తెరకెక్కించిన ‘ఆచార్య’తో కొరటాలకు బ్రేక్ పడింది. దీంతో స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేయడానికి ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి గ్లోబల్ హిట్ సాధించిన తర్వాత కూడా ఎన్‌టీఆర్.. కొరటాల శివకు ఛాన్స్ ఇచ్చాడు. అతిత్వరలో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు రానుండగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ.


సీక్వెల్‌పై క్లారిటీ

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్‌టీఆర్ నుండి ఒక్క సినిమా కూడా బయటికి రాలేదు. అందుకే ‘దేవర’ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలైతే ఈ సినిమా 2024 సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. అప్పుడే ‘దేవర’ గురించి క్లారిటీ ఇవ్వడం కోసం కొరటాల శివ ఒక వీడియోను విడుదల చేశారు. ఎన్నో ప్యాన్ ఇండియా సినిమాలలాగానే ‘దేవర’ కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని, మంచి ఔట్‌పుట్ కోసం అందరం కష్టపడుతున్నామని ప్రకటించాడు. ప్రస్తుతం ‘దేవర’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కొరటాల.. దీని సీక్వెల్‌పై కూడా క్లారిటీ ఇచ్చాడు.


Also Read: ఒరేయ్.. రిలీజ్ డేట్ చెప్పరేంట్రా.. టెన్షన్ తోనే పోయేలా ఉన్నాం

ఆలస్యం అవ్వక తప్పదు

‘‘నేను దేవర 2ను ఇప్పుడంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అందుకే జూనియర్ ఎన్‌టీఆర్‌తో పాటు ఇతర యాక్టర్ల షెడ్యూల్స్ గురించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ దేవర 2 ప్రారంభం అవ్వడానికి చాలా సమయం పడుతుంది అనుకుంటే నేను వెంటనే వేరే కొత్త సినిమాపై పనిచేయడం మొదలుపెడతాను. దాని తర్వాత దేవర 2 గురించి ఆలోచిస్తాను’’ అని క్లారిటీ ఇచ్చాడు కొరటాల శివ. దీంతో ‘దేవర 2’ పరిస్థితి అయోమయంగా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కొరటాల వేరే సినిమాతో బిజీ అయ్యి.. ఎన్‌టీఆర్ కూడా తన అప్‌కమింగ్ సినిమాలపై ఫోకస్ పెడితే ‘దేవర 2’ కచ్చితంగా లేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనాలు వేస్తున్నారు.

ఇంట్రెస్ట్ పోయింది

ఇంతకు ముందు కూడా ఎన్నో ప్యాన్ ఇండియా సినిమాలు మొదటి భాగం హిట్ అయిన తర్వాత రెండో భాగం విడుదల కోసం చాలా గ్యాప్ తీసుకున్నాయి. దాంతో కొన్ని సినిమాలపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కూడా పోయింది. ‘దేవర 2’ మాత్రం అలా జరగకుండా ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ‘దేవర’తో పాటు ‘వార్ 2’ షూటింగ్‌ను కూడా ఒకేసారి పూర్తిచేశాడు ఎన్‌టీఆర్. ఆ సినిమా షెడ్యూల్‌తో తనకు ఇంక ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాను నటించనున్న మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. దాని తర్వాత ఇంకా ఏ ప్రాజెక్ట్స్ ఓకే చేయలేదు కాబట్టి ‘దేవర 2’ స్టార్ట్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×