BigTV English

Sleep Apnea: ఇలా నిద్రపోతున్నారా జాగ్రత్త.. లేదంటే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే చాన్స్ ఎక్కువ..

Sleep Apnea: ఇలా నిద్రపోతున్నారా జాగ్రత్త.. లేదంటే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే చాన్స్ ఎక్కువ..

Sleep Apnea: మీకు రాత్రి వేళల్లో నిద్ర సరిగా రావడం లేదా. రాత్రి సమయాల్లో తరచుగా మేల్కొంటున్నారా. దీంతోపాటు నిద్రపోయిన తర్వాత కూడా అలసటగా అనిపిస్తుందా, ఇబ్బంది పడుతున్నారా. అయితే మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే స్లీప్ అప్నియా రుగ్మత ఉన్నట్లే. ఇలాంటి క్రమంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్లీప్ అప్నియాతో అనేది తీవ్రమైన నిద్ర వ్యాధి రుగ్మత. ఇది వ్యక్తి నిద్రపోతున్నప్పుడు శ్వాస ఆగిపోవడం వల్ల ఏర్పడుతుంది.


ఆరోగ్య సమస్యలు

ఈ పరిస్థితిని అధిగమించాలంటే నిద్రలో ఉన్నప్పుడు శ్వాస తీసుకునేందుకు మెదడును మేల్కొల్పడం ద్వారా పరిష్కరించబడుతుంది. అయితే తరచూ జరిగే శ్వాస ఆగిపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ క్రమంలో వ్యక్తి శరీరంలో ఆక్సిజన్ స్థాయి కూడా క్రమంగా తగ్గుతుంది. ఇది కొన్ని సార్లు గుండెకు తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. గుండెకు సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. దీని ఫలితంగా గుండె జబ్బులు, హైపర్ టెన్షన్, ఇతర సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

స్లీప్ అప్నియా లక్షణాలు

రాత్రి సమయంలో తరచుగా మేల్కొనడం. నిద్రపోయిన తర్వాత కూడా అలసటగా అనిపించడం. నిద్రలో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దాలు చేయడం. మూడ్ స్వింగ్‌లు, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా కారణాలుగా ఉన్నాయి.


Read Also:  Non Veg Food: నెల రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తే.. ?

స్లీప్ అప్నియా తగ్గించుకునేందుకు చిట్కాలు

  • అధిక బరువు ఉన్న వ్యక్తులు స్లీప్ అప్నియాకు ఎక్కువగా గురవుతారు. కాబట్టి బరువు తగ్గడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కూడా దీని బారి నుంచి తప్పించుకోవచ్చు. ఎలాగంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాలి
  • నిద్ర విషయంలో పలు రకాల పద్ధతులను పాటించాలి. ఉదాహరణకు ఎడమ పక్కకు నిద్రించడం వంటివి
  • స్లీప్ అప్నియా ఉన్న ఎక్కువగా అనిపిస్తే మాత్రం ఆయా వ్యక్తులు వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలి
  • దీంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పాటు చేసుకోవాలి. వ్యాయామం, ధ్యానం, మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ఉత్సాహంగా ఉంచుతాయి

స్లీప్ అప్నియా, పార్కిన్సన్స్

స్లీప్ అప్నియా ఉన్న వ్యక్తులు దీర్ఘకాలికంగా ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే పార్కిన్సన్స్ వంటి నరాల సంబంధిత వ్యాధులకు గురవుతారు. ఇది మెదడులోని నరాల కణాలను దెబ్బతినడం వల్ల జరుగుతుంది. కాబట్టి స్లీప్ అప్నియాను నియంత్రించుకోవడం ద్వారా మీరు ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

పరిస్థితిని గుర్తించి

సాధారణంగా ప్రతి మనిషికి కూడా నిద్ర చాలా ప్రధానం. సాధారణ వ్యక్తికి ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. దీంతో పాటు నిద్ర సమయంలో ఎలాంటి భంగం లేకుండా ఉంటే పర్వాలేదు. కానీ ప్రతిరోజు కూడా నిద్రకు ఆటంకం ఏర్పడితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో స్లీప్ అప్నియా పరిస్థితిని గుర్తించి, మీ ఆరోగ్యకరమైన జీవనశైలిని మార్పు చేసుకోవాలి. దీంతోపాటు వైద్యులను సంప్రదించి ఎలాంటి పద్దతులు పాటించాలనేది తెలుసుకోవాలి. ఈ క్రమంలో మీరు ప్రతి రోజు వ్యాయామం చేయడంతోపాటు జంక్ ఫుడ్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

Related News

Paneer SideEffects: పనీర్ ఇష్టంగా తింటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలతో జాగ్రత్త

Protein Shake: క్షణాల్లోనే రెడీ అయ్యే.. ప్రోటీన్ షేక్, సూపర్ టేస్ట్‌తో.. !

Gutti Vankaya Curry: నోరూరించే గుత్తి వంకాయ కర్రీ.. ఇలా చేస్తే ఎవ్వరైనా ఫిదానే !

Walk With Friend: ఫ్రెండ్‌తో కలిసి నడిస్తే.. ఇలా జరుగుతుందా? చాలా మిస్ అవుతున్నారు బ్రో !

Hyderabad: లాంఛనంగా ప్రారంభమైన “ది హౌస్ ఆఫ్ కోయిలా”.. అతిథులు వీరే!

Interval Walking Benefits: జాగింగ్ కంటే ఇదే బెస్ట్.. అందుకేనా జపాన్‌లో అంత క్రేజ్ !

Velaterapia: జుట్టుకు మంటలు.. ఇదేం మాయదారి ట్రెండ్ రా? ఇది ఏ దేశంలో మొదలైందో తెలుసా?

Director Sukumar: హైదరాబాదులో సుకుమార్ సందడి.. ఘనంగా ప్రారంభోత్సవం!

Big Stories

×