Kraven the Hunter: సూపర్ హీరో సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి సినిమాలు మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా నిలుస్తాయి. అలా సోని సంస్థ నుండి మరొక సూపర్ హీరో సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. 2025 న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో సినిమాలు విడుదల అవుతాయని మూవీ లవర్స్ ఎదురుచూశారు. కానీ అలా జరగలేదు. ఇలాంటి సమయంలో ప్రేక్షకులను అలరించడానికి ‘క్రావెన్: ది హంటర్’ వచ్చేస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సూపర్ హీరో టచ్ కూడా యాడ్ అవ్వనుంది. జనవరి 1న ‘క్రావెన్: ది హంటర్’ విడుదలకు సిద్ధమవ్వడంతో మూవీ డైరెక్టర్ జేసీ చాందోర్ మీడియాతో మాట్లాడారు.
మైండ్ బ్లోయింగ్ యాక్షన్
మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘క్రావెన్: ది హంటర్’కు ఆర్ రేటింగ్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. దీనిపై చాందోర్ స్పందించారు. ‘‘ఈ సినిమాకు ఆర్ రేటింగ్ రావడం సంతోషంగా ఉంది. ఇది చూస్తుంటే కథకు నేను న్యాయం చేయగలిగానని అనిపిస్తోంది. క్రావెన్ లాంటి కథను అద్భుతంగా చెప్పడం అవసరం. అదే సమయంలో ఈ సినిమాకు ఆర్ రేటింగ్ రావడం శుభ పరిణామం’’ అని చెప్పుకొచ్చారు చాందోర్. అంతే కాకుండా ‘క్రావెన్: ది హంటర్’ కథను కూడా ఆయన బయటపెట్టారు. అసలు ఈ సినిమా కథ ఎలా ప్రారంభమవుతుందని వివరించారు. సెర్గీ అనే వ్యక్తి కోపంతో చేసిన తప్పే ఈ కథకు మూలం అని తెలిపారు.
Also Read: థియేటర్‌లోకి మళ్లీ వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’.. రిలీజ్ ట్రైలర్ చూశారా..?
అదే కథకు మూలం
‘‘కోపం, ఆవేశంతో సెర్గీ అనే కుర్రాడు తను టీనేజ్‌లో ఉన్నప్పుడే ఇద్దరు పిల్లలను చంపేస్తాడు. ఆ హత్యల నుండి తను ఈజీగా తప్పించుకునే ఛాన్స్ ఉన్నా కూడా అలా చేయకుండా ఉంటాడు. అలా ఎందుకు చేస్తాడని కూడా సినిమాలో స్పష్టంగా వివరించాం. తను హత్య చేసిన ఇద్దరూ చెడ్డ వ్యక్తులు అని తను భావిస్తాడు. ఆపుకోలేని కోపంలో, ఆవేశంలో ఈ భూమి మీద నుండి ఇద్దరిని చంపేశా అని తను అనుకుంటాడు. ఆ కోపమే ఈ కథకు ఆయువుపట్టు’’ అని చాందోర్ వివరించారు. అలా ‘క్రావెన్: ది హంటర్’ సినిమాకు సంబంధించి కీలక విషయాన్ని బయటపెట్టారు చాందోర్. దీంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.
మార్వెల్ విలన్ కథ
‘క్రావెన్: ది హంటర్’ సినిమా అద్భుతమైన యాక్షన్ ఎలిమెంట్స్‌తో అలరిస్తుందని మేకర్స్ చెప్తున్నారు. మార్వెల్‌లో ఎంతోమంది విలన్స్ ఉన్నారు. దానికి సంబందించిన ఒక ఐకానిక్ విలన్ కథను ఈ సినిమాలో చూడవచ్చు. ఆరాన్ టేలర్-జాన్సన్, అతని గ్యాంగ్స్టర్ తండ్రి నీఙ్కళైతో ఉండే పగ, ప్రతీకారం ఈ సినిమాలో చూపించారు చాందోర్. ‘క్రావెన్: ది హంటర్’లో అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్ మరియు రస్సెల్ క్రౌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 1 న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.