Rashmika.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న(Rashmika Mandanna)ముఖ్యంగా ‘ఛలో’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ‘గీతాగోవిందం’ సినిమా చేసి మంచి పాపులారిటీ అందుకుంది.అంతేకాదు ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు భారీగా పెరిగిపోయారు. దీనికి తోడు వీరిద్దరి మధ్య కూడా ఏదో ఉందనే వార్తలు వినిపించాయి..ఇక ఇప్పటికీ కూడా ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. మరొకవైపు రష్మిక.. ఎక్కువగా విజయ్ దేవరకొండతో కలిసి కనిపించడమే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా సినిమాలు చూడడం లాంటివి చేస్తోంది. మరొకవైపు నా బాయ్ ఫ్రెండ్ మీ అందరికీ తెలిసిన వాడే అంటూ పెద్ద షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీనికి తోడు అటు విజయ్ దేవరకొండ కూడా నేను సింగల్ గా లేను అని చెప్పి హింట్ ఇచ్చాడు. ఇలా వీరిద్దరి మాటలు బట్టి చూస్తే ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలకు ఆజ్యం పోస్తున్నారు అని చెప్పవచ్చు.
ఇద్దరిలో ఎవరు గొప్ప..?
రష్మిక,విజయ్ దేవరకొండను ప్రేమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నా..ఆమె ఆవేవీ పట్టించుకోకుండా కెరియర్ పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇటీవల అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన ‘పుష్ప -2’ సినిమాలో శ్రీవల్లి గా నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాల్లో పుష్పరాజ్ – శ్రీవల్లి పాత్రలు తెరపై బాగా పండాయి. అంతేకాదు ఇప్పుడు ఈ జోడీ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అని చెప్పవచ్చు. ఇలా రష్మీకకు ఇద్దరితో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే రష్మీకను ఒక అభిమాని ఊహించని ప్రశ్న అడిగారు. అయితే రష్మిక మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా తెలివిగా సమాధానం తెలిపింది..
రష్మిక తెలివైన సమాధానం..
ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్నతో అల్లు అర్జున్ లేదా విజయ్ దేవరకొండ ఇద్దరిలో ఎవరు బెస్ట్? అని అడిగగా ఆమె మాట్లాడుతూ.. “విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా వండర్ తో సమానం. వీరిద్దరూ కూడా మన ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటులలో స్థానం సంపాదించుకున్నారు. ఇంతటి ప్రతిభావంతులైన ఇద్దరి గురించి నేను మాట్లాడడం సరికాదు. ముఖ్యంగా మీరు నన్ను ఇలాంటి ప్రశ్న అడగడం కూడా అర్థం లేదు. ఇతరుల ప్రతిభతో సమానమైన వారికే.. ఎదుటివారి ప్రతిభ గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు, అధికారం ఉంటాయి. కాబట్టి వాళ్ళిద్దరి టాలెంట్ పై వ్యాఖ్యానించే అర్హత నాకు ఏమాత్రం లేదు” అంటూ చాలా తెలివిగా సమాధానం చెప్పి, కాంట్రవర్సీలకు తావు ఇవ్వకుండా తప్పించుకుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే రష్మిక సమాధానం విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.