Krishna in Padmalaya Studio : సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో సంతాపంగా టాలీవుడ్ షూటింగ్‌లకు బంద్ పిలుపునిచ్చారు నిర్మాతల మండలి. నవంబర్ 16న టాలీవుడ్, తెలుగు సినిమా షూటింగ్‌లన్నీ రద్దు చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్నింగ్ షోలను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణ కుటుంబంలో ఏడాదిలో ముగ్గురు మరణించడం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణ మృతితో ఓ శకం ముగిసిందని సీనియర్ నటులు అంటున్నారు.
కృష్ణ స్థాపించిన పద్మాలయ స్టూడియోలోనే ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. తెలుగు రాష్ట్రాలనలుమూలల నుంచి అభిమానులు కృష్ణను కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. కృష్ణ కూతురు మంజుల సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ చేసింది. మీరు మాకు నిజమైన సూపర్‌స్టార్ అంటూ కన్నీటిపర్యంతమైంది.మధ్యాహ్నం 3 గంటల తరువాత ఫలింనగర్‌లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించనున్నారు.