MBNR Student Suicide : జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామంలో డిగ్రీ విద్యార్థిని మేఘలత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐతే ఆమె చావుకు వేధింపులే కారణంగా తెలుస్తోంది. కొందరి యువకుల బ్లాక్ మెయిల్ వల్లే తాను చనిపోతున్నట్టు విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది.
అనంతపురం గ్రామానికి చెందిన మేఘలత మేనత్త కొడుకు శివకుమార్ ఈ నెల 6న ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోయే ముందు మేఘలతతో కలిసి దిగిన ఫోటోను తన స్నేహితులకు షేర్ చేసినట్టు తెలుస్తోంది. ఆ ఫోటోలతో గ్రామానికి చెందిన కొందరు యువకులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆ మనస్తాపంతోనే ఉరి వేసుకుని చనిపోతున్నట్టు మేఘలత సూసైడ్ నోట్ రాసింది. తనను వేధించిన వారిని వదలొద్దు నాన్న అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది. అమ్మా,నాన్నా చనిపోతున్నందుకు నన్ను క్షమించండి అంటూ నోట్‌లో రాసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు