Kubera : డాలర్ డ్రీమ్స్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శేఖర్. అయితే ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు అనేది వాస్తవం. కానీ ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది.ఈ సినిమా తర్వాత శేఖర్ దర్శకత్వం వహించిన సినిమా ఆనంద్. అప్పట్లో ఈ సినిమా డీసెంట్ హిట్గా నిలిచింది. ఒకవైపు శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా రిలీజ్ అవ్వటం దానితో పాటుగా ఈ సినిమా రిలీజ్ అవ్వటం యాదృచ్ఛికంగా జరిగింది. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా టికెట్లు దొరకని చాలామంది ఆనంద్ సినిమాకు వెళ్లడం మొదలుపెట్టారు. వెళ్లిన తర్వాత అర్థమైంది ఇది ఒక మంచి కాఫీలాంటి సినిమా అని. ఇక కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో దర్శకుడుగా సెటిల్ అయిపోయాడు శేఖర్.
ఫస్ట్ టైం భారీ బడ్జెట్
శేఖర్ దర్శకత్వంలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా హ్యాపీడేస్ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అని శేఖర్ కమల చూపించిన విధానం చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఇప్పటికీ కూడా చాలామందికి ఫేవరెట్ సినిమా అది. అయితే శేఖర్ కమల సినిమాలన్నీ కూడా భారీతనంతో కాకుండా మన మధ్య జరిగే కథ లా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని లవ్ స్టోరీస్ ని శేఖర్ కమల తీసిన విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం శేఖర్ కెరియర్లో భారీ బడ్జెట్ తో సినిమాను చేస్తున్నారు. ధనుష్ హీరోగా శేఖర్ దర్శకత్వంలో కుబేర అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.
ఎవరి బడ్జెట్ ఎంత
ఇక ఈ సినిమాకి సంబంధించి ధనుష్ ఏకంగా 30 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే దీనికోసం నాగార్జున 14 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా కోసం మూడు కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక నాలుగు కోట్ల బడ్జెట్ తీసుకుంటున్నట్లు విశ్వసినీయ వర్గాల సమాచారం. అయితే ఇంతకుముందు ఎప్పుడు శేఖర్ కమ్ముల గాని, ధనుష్ గాని ఇంత భారీ బడ్జెట్ తో సినిమాని చేయలేదు. వారి కెరియర్ లో వస్తున్న మొదటి భారీ బడ్జెట్ సినిమా ఇది. ఇక ఈ సినిమా ఎంత మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
Also Read : NTRNeel Movie : తారక్ బక్కచిక్కింది డ్రాగన్ కోసమే… 5 నెలల్లో ఎన్ని కేజీలు తగ్గాడో తెలిసా..?