RR vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… ఓ బాంబు లాంటి వార్త తెరపైకి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో తొలిసారిగా ఫిక్సింగ్ (Match Fixing ) ఆరోపణలు తెరపైకి వచ్చాయి. రాజస్థాన్ జట్టు పై ( Rajasthan Royals ) ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. జైపూర్ వేదికగా ఏప్రిల్ 19వ తేదీన లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Lucknow Super Giants vs Rajasthan Royals ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అవలీలగా రాజస్థాన్ రాయల్స్ గెలవాల్సి ఉంది.
చివరి ఓవర్ లో తేలిపోయిన రాజస్థాన్
కానీ చివరి క్షణం లో రాజస్థాన్ రాయల్స్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. చివరి ఓవర్ లో బ్యాటర్లు… పరుగులు చేయడానికి వీలున్న కూడా… అసలు చేయలేదు. దీంతో లక్నో సూపర్ జట్టు పైన రాజస్థాన్ రాయల్స్ దారుణంగా ఓటమిపాలైంది. అయితే లక్నో సూపర్ జెంట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కావాలనే ఓడిపోయిందని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఓటమికి మ్యాచ్ ఫిక్సింగ్ కారణమంటూ… కొత్త అంశం తెరపైకి వచ్చింది.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్
రాజస్థాన్ రాయల్స్ జట్టు పైన ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో… రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహాని స్పందించారు. లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్… మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని… ఆయన ఆరోపణలు చేశారు. సొంత గ్రౌండ్లో గెలుపు ఖాయం అనుకున్న దశలో ఎలా ఓడిపోతారని ఈ సందర్భంగా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్ హాక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ను పక్కన పెట్టిందని కూడా ఆయన మండిపడ్డారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. దీనిపై… క్రీడా అభిమానులు కూడా ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. నిజంగానే ఆ మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెబుతున్నారు. గెలవాల్సిన దశలో కావాలనే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినట్లే మనకు స్పష్టం అవుతుందని చెబుతున్నారు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో కూడా ఇదే జరిగిందని అంటున్నారు. మరి దీనిపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన యాజమాన్యం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.