BigTV English
Advertisement

L2 Empuraan : ఓటీటీలోకి మోహన్ లాల్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే.?

L2 Empuraan : ఓటీటీలోకి మోహన్ లాల్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే.?

L2 Empuraan : మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్నా ప్రతి సినిమా భారీ సక్సెస్ ను అందుకుంటున్నాయి. అందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ  ఎల్ 2 ఎంపురాన్.. గతంలో వచ్చిన లూసిఫర్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. దీని తర్వాత ఎన్నో సినిమాల వచ్చాయి కానీ ఆ సినిమాలు హిట్ అయినా అంతగా కలెక్షన్స్ ని వసూలు చేయలేకపోయాయి. ఇన్నాళ్లకు ఆ సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఎంపురాన్ మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుంది. మార్చి 27న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. లూసిఫర్ కి క్లైమాక్స్ నుంచి ఈ సినిమా కంటిన్యూ అవుతుంది. దాంతో సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఓటీటీలోకి ఈ మూవీ వచ్చేస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు  ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..


ఓటీటీ డీటెయిల్స్.. 

ఇటీవల రిలీజ్ అవుతున్న మోహన్ లాల్ మూవీలు అన్నీ భారీ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. అలాగే ఎంపురాన్ కూడా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేస్తుందని తెలుస్తుంది.. ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ పింక్ విల్లా వెల్లడించింది. జియో హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ వంటి 5 భాషల్లో ఎల్2 ఎంపురాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.. ఇప్పటి వరకు ఈ మూవీ 270 కోట్లకు పైగా వసూల్ చేసింది..


మూవీ స్టోరీ విషయానికొస్తే..

ఎల్2కి కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. అలాగే, ఇందులో కీలక పాత్రలో నటించాడు. దీనికి సంబంధించిన ట్రైలర్, టీజర్ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. లూసిఫర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కితే.. ఎల్2 ఎంపురాన్ రాజకీయ అంశాలతో పాటు ఇందులోనే ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా ను టచ్ చేసి తెరకెక్కించారు.. ఐయూఎఫ్ పార్టీలో సమస్యలన్ని సద్దుమణుగిపించిన స్టీఫెన్ నెడుంపల్లి అజ్ఞాతంలోకి వెళ్తాడు. పార్టీ పగ్గాలు, అధికారం చేతికొచ్చిన తర్వాత జతిన్ రామ్‌దాస్ భారీగా అవినీతి చేస్తాడు. తను చేస్తున్న అవినీతి పనులను తన సోదరుడు అడ్డుకుంటాడా లేదా అన్నది ఈ మూవీ స్టోరీ… థియేటర్లలో ప్రస్తుతం సక్సెస్ఫుల్ టాక్ ని అందుకున్న మూవీ ఓటిటిలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. భారీ యాక్షన్ కథతో వచ్చిన ఈ మూవీ ఘన విజయాన్ని అందుకుంది. దాంతో సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ కూడా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటుందనే టాక్ వినిపిస్తుంది. ఇక మోహన్ లాల్ కొత్త సినిమా లో నటిస్తున్నాడు. త్వరలోనే దాని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది…

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×