Kovai Sarala:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాస్యబ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు బ్రహ్మానందం (Brahmanandam). ముఖ్యంగా అప్పట్లో ఈయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే స్టార్ హీరోలను మొదలుకొని, చాలామంది సినిమాలలో నటించి.. ఎక్కువ సినిమాలలో కామెడీ రోల్ పోషించిన నటుడిగా గిన్నిస్ బుక్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకున్నారు. బ్రహ్మానందం ఒక హాస్య నటుడు మాత్రమే కాదు.. ఎమోషన్ పండించడంలో కూడా ఈయన తర్వాతే ఎవరైనా.. ముఖ్యంగా ‘బాబాయ్ హోటల్’ సినిమా ఎంత మంచి గుర్తింపు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి బ్రహ్మానందం కి జోడిగా నటించి లేడీ కమెడియన్ గా చెరగని ముద్ర వేసుకుంది కోవై సరళ. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తెరపై వీరిద్దరూ కనిపించారంటే చాలు.. ఆటోమెటిగ్గా చూసే వారి మోమోలో నవ్వు కనిపిస్తుంది. అంతలా పేరు దక్కించుకున్నారు.
వడివేలు పై కోవై సరళ కామెంట్స్..
అయితే ఇలాంటి కోవై సరళ నటుడు వడివేలుతో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తనకు ఎదురైన అనుభవాలను పంచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. వడివేలు తో కలిసి కూడా ఎన్నో పలు చిత్రాలలో హాస్య సన్నివేశాలలో నటించింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోవై సరళ మాట్లాడుతూ.. వడివేలు గురించి ఎంతో సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే అందులో ఎంత నిజం ఉందో నాకు తెలియదు కానీ, నేను పంచుకోగలిగేదైతే పూర్తిగా నిజం.. మనం అతనితో ఒక కామెడీ సన్నివేశం చేయాలనుకున్నప్పుడు, ఆ సన్నివేశానికి ముందు మనం రిహార్సల్స్ చేయాలి. రిహార్సల్స్ చేయకుండా నేరుగా కెమెరా ముందుకు వెళ్లడం తప్పు. ఎందుకంటే ఆయన సెట్ లో ఆన్ ది స్పాట్ చేసే కామెడీని చూసినప్పుడు, మనం కచ్చితంగా నవ్వకుండా ఉండలేము. కెమెరా మీ నవ్వును ఆపుకోకుండా నటనను చూపిస్తుంది. ఈ విధంగానే ప్రతి సన్నివేశానికి ముందు మనం సరిగ్గా పరిహార్సల్స్ చేయాల్సిందే. దేనికి సిద్ధం కాకుండా నేరుగా నటించడం వల్ల ఫుటేజ్ లో లోపాలు ఏర్పడవచ్చు లేదా ఎవరైనా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు ఆయనతో పోటీ పడాలంటే మాత్రం మనం కచ్చితంగా ఇబ్బంది పెడతాం అలా ఎన్నోసార్లు నేను కూడా ఇబ్బంది పడ్డాను. అందుకే ఆయనతో సన్నివేశం చేసేటప్పుడు తప్పకుండా నేను రిహార్సల్స్ చేసి మరి వెళ్తాను. అంతేకాదు రిహార్సల్స్ చేసేటప్పుడు మనం అన్ని వివరాలను స్పష్టంగా చర్చించి, నువ్వు ఇలా రావాలి.. నేను ఇలా నడుస్తాను అనే సమాచారాన్ని కూడా ప్లాన్ చేసుకుంటాము అంటూ ఆమె తెలిపారు. అయితే ఆయనను చాలామంది తప్పుగా మాట్లాడడం బాధ వేస్తుంది. ఆయన ఒక గొప్ప నటుడు అంటూ కోవై సరళ తెలిపింది . ప్రస్తుతం కోవై సరళ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
కోవై సరళ కెరియర్..
ఇక కోవై సరళ విషయానికి వస్తే.. ఇప్పటికీ ఈమె స్టిల్ బ్యాచిలర్ అనే చెప్పాలి..కుటుంబ బాధ్యత తీసుకున్న ఈమె తన తోడబుట్టిన వారికి వివాహాలు చేసి వారికి ఒక జీవితాన్ని ప్రసాదించి, ప్రస్తుతం ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది కోవై సరళ. ఇక ఇప్పటికీ కూడా అడపా దడపా అవకాశాలు అందుకుంటూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది కోవై సరళ. ఏది ఏమైనా కోవై సరళ చేసిన ఈ కామెంట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.