Thandel Collections : అక్కినేని హీరో నాగ చైతన్య ( nagachaithanya )నటించిన తాజా చిత్రం తండేల్… టాలీవుడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 7న రిలీజైన ఈ మూవీ ఆరంభం నుంచి మంచి కలెక్షన్లతో సత్తాచాటుతోంది.. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తుంది. తండేల్ సినిమా 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ తాజాగా అధికారికంగా వెల్లడించింది. బాక్సాఫీస్ దుళ్లకొట్టేశారు. థియేటర్లకు జాతర తెచ్చేశారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టడం మామూలు విషయం కాదు. మొత్తానికి చైతూ ఖాతాలో హిట్ మూవీ పడినట్లే.. ఇక మొత్తం కలెక్షన్స్ ఎంత అనేది ఒకసారి చూసేద్దాం..
తండేల్ సినిమాలో మత్స్యకారుడు రాజు పాత్రలో నాగచైతన్య మెప్పించారు. ఎమోషనల్ సీన్లలోనూ ఆకట్టుకున్నారు. సాయిపల్లవి మరోసారి మ్యాజిక్ చేశారు. నిజజీవిత ఘటనలతో ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించారు. లవ్ స్టోరీ ప్రధానంగా ఈ మూవీని తీసుకొచ్చారు.. మనిషిని కాపాడటం కోసం వెళ్లి పాకిస్తాన్ వాళ్లకు చిక్కడం ఆ తర్వాత జైల్లో వాళ్ళు అనుభవించిన పరిస్థితులను ఆధారంగా ఈ మూవీని తెర కేక్కించారు. మొత్తానికి థియేటర్ లో జనాలను ఎమోషనల్ సీన్లతో కంట తడి పెట్టించింది. ఫస్ట్ షో నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ను అందుకున్న మూవీ కలెక్షన్స్ ఏంతో ఒకసారి చూసేద్దాం..
Also Read : ప్రేమలో పడ్డ మలయాళ బ్యూటీ.. ఒక్క పోస్ట్ తో హింట్ ఇచ్చేసిందే..
ఇకపోతే తండేల్ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసి, హీరో నాగ చైతన్య కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా నిలించింది.. అదే జోరు రెండో రోజు కూడా కొనసాగింది. రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ. 22 కోట్లు. ఇక నాలుగవ రోజు రూ. 10 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఐదో రోజు కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ 5 డే రూ. 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే 80 కోట్లకు పైగా వసూల్ చేసిందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కేవలం 8 రోజుల్లో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎనిమిది రోజులకు 90.12 కోట్లు వసూల్ చేసింది.. తొమ్మిది రోజుల్లోనే 100 కోట్లను వసూల్ చేసి మంచి రికార్డును సొంతం చేసుకుంది. థియేటర్ల వద్ద సందడి తగ్గిన కలెక్షన్స్ తగ్గలేదు.. త్వరలోనే 200 కోట్లు వసూల్ చెయ్యనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ చిత్రంలో కరుణాకరన్, ప్రకాశ్ బెలవాది, ఆడుకాలం నరేన్, పృథ్విరాజ్, చరణ్‍దీప్, కల్పలత కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ప్రొడ్యూజ్ చేయగా.. అల్లు అరవింద్ సమర్పించారు.