Allu Arjun : ప్రతి హీరో కెరియర్ లో కొన్ని మైల్ స్టోన్ ఫిలిమ్స్ ఉంటాయి. ఆ సినిమాలు ఆ హీరోను ఎక్కడో నిలబడతాయి. ఒకేసారి పది మెట్లు ఎక్కే విధంగా సహాయపడతాయి. అలాంటి సినిమాలు రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా వచ్చాయి అని చెప్పాలి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ప్రభాస్ కి ఏ రేంజ్ గుర్తింపు తీసుకొచ్చింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. ముఖ్యంగా ఆ రోజుల్లో ఒక సినిమా కోసం దాదాపు 5 సంవత్సరాలు కేటాయించటం అనేది మామూలు విషయం కాదు. కానీ రాజమౌళి సక్సెస్ ట్రాక్ తో పాటు ఆ కథని నమ్మి తన కెరీర్ ఐదేళ్లపాటు బాహుబలి సినిమాకు అంకితం చేశాడు ప్రభాస్. అందుకే ప్రస్తుతం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్పాలి. అసలు తెలుగు సినిమా మార్కెట్ దశ దిశ రెండిటిని మార్చింది బాహుబలి సినిమా. ఒకప్పుడు 100 కోట్లు సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూడాలి అనుకోవడమే గగనం అనుకున్నప్పుడు, బాహుబలి లాంటి సినిమా వచ్చి 1000 పైగా కోట్లు మార్కెట్ క్రియేట్ చేసింది.
ఇక మళ్లీ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంతటి స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో మళ్లీ ఇద్దరు హీరోలకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇది ఒక మైల్ స్టోన్ ఫిలిం అని చెప్పాలి. అయితే రాజమౌళి తో పనిచేసిన హీరోలకు మాత్రమే కాకుండా మిగతా హీరోలలో ఈ రేంజ్ ఫ్యాన్ బేస్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా అల్లు అర్జున్ అని చెప్పాలి. దర్శకుడు సుకుమార్ కూడా నెక్స్ట్ లెవెల్ లో టార్గెట్ పెట్టుకొని పుష్ప సినిమాను చేశాడు. సక్సెస్ ఫుల్ గా పుష్ప సినిమా ఆ టార్గెట్ ను అందుకుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి దక్కనటువంటి నేషనల్ అవార్డును అల్లు అర్జున్ కు వచ్చేలా చేసింది.
LAST DAY LAST SHOT OF PUSHPA . 5 years JOURNEY of PUSHPA completed . What a journey 🖤 pic.twitter.com/eQoRhcLFMQ
— Allu Arjun (@alluarjun) November 26, 2024
ఇకపోతే పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. పుష్ప సినిమా కోసం దాదాపు ఐదేళ్లపాటు అల్లు అర్జున్ కష్టపడ్డాడు. ఆ మేకప్ లో ఉండి సినిమాలో నటించడం అనేది మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ పైన ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా తను సినిమా కోసం ఎఫర్ట్స్ పెట్టి పని చేసింది అయితే మాత్రం నిజం. తాజాగా ఈ సినిమా లాస్ట్ షాట్ కూడా పూర్తయినట్టు ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఐదేళ్ల జర్నీ ముగిసిపోయింది. వాట్ ఏ జర్నీ అంటూ ఒక లవ్ సింబల్ కూడా జోడించాడు.
Also Read : Buchi Babu – Rajamouli : రమా రాజమౌళి టెక్నిక్ ఫాలో అవుతున్న బుచ్చిబాబు