Taraka Ratna – Alekhya Reddy: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న (Tarakaratna). ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు సైన్ చేసిన హీరోగా కూడా రికార్డు సృష్టించారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆయన నటించిన ఏ సినిమా కూడా ఆయనకు హీరోగా మంచి గుర్తింపును అందివ్వలేదు. దాంతో యు టర్న్ తీసుకున్న తారకరత్న ‘అమరావతి’ వంటి చిత్రంలో నటించి నంది అవార్డు కూడా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈయన సడన్గా నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని మొదటి రోజే గుండెపోటు కారణంగా హాస్పిటల్ పాలయ్యాడు.
యువగళం పాదయాత్రలో తుది శ్వాస విడిచిన తారకరత్న..
దాదాపు కొన్ని రోజులపాటు బెంగళూరులో చికిత్స తీసుకున్న ఈయన మృత్యువుతో పోరాడి చివరికి 2023 ఫిబ్రవరి 18న తుదిస్వాస విడిచారు. అప్పట్నుంచి ఆయన భార్య అలేఖ్య రెడ్డి (Alekhya reddy) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అంతేకాదు అప్పుడప్పుడు తన భర్తను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్టు కూడా పెడుతూ ఉంటుంది. కుటుంబ బాధ్యతలు ఇతర పనులతో బిజీ అవుతున్న అలేఖ్య, ఇప్పుడిప్పుడే భర్త లేడు అన్న విషయాన్ని తెలుసుకొని ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టడం ప్రారంభించింది. ముగ్గురు పిల్లలతో కుటుంబ బాధ్యతను నెత్తిన వేసుకున్న అలేఖ్య రెడ్డి ఇటీవలే పెద్ద కూతురు నిష్క సారీ ఫంక్షన్ ని కూడా అంగరంగ వైభవంగా జరిపించింది.
పిల్లలతో కలిసి ఫోటోలు షేర్ చేసిన అలేఖ్య రెడ్డి..
అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇలా నిష్క ఆఫ్ సారీ ఫోటోలు షేర్ చేయడంతో అందరూ ఈమెపై ప్రశంసలు కురిపిస్తూ అలేఖ్య భర్త లేకపోయినా కూతురి ఆలనా పాలనా చూసుకుంటుంది. చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అలేఖ్య రెడ్డి ఎన్నడూ లేని విధంగా పిల్లలతో కలిసి ఫోటోలను షేర్ చేసింది. ఇందులో బ్లూ జీన్స్ ధరించిన ఈమె..స్టైలిష్ లుక్ లో కనిపించి, అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ముగ్గురు పిల్లలకు తల్లి అయినా సరే యంగ్ హీరోయిన్ లా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ అంతేకాదు ఈ ఫోటోలు చూసిన చాలామంది నెటిజెన్స్.. నిష్కా కి అక్కలా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. సరదాగా పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అలేఖ్య రెడ్డి.
అలేఖ్య రెడ్డిని దూరం పెట్టిన నందమూరి కుటుంబ..
ఇకపోతే నందమూరి కుటుంబం విషయానికి వస్తే.. అలేఖ్య రెడ్డి అప్పటికే వివాహం చేసుకొని మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. అలాంటి ఆమెను తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తారకరత్న కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.. దాంతో వీరిని తమ కుటుంబంలోకి ఆహ్వానించలేదు. దీనికి తోడు గుండెపోటుతో హాస్పిటల్ పాలైనప్పుడు కూడా ఈయనను చూడడానికి వెంటనే ఎవరు రాలేదు. ఆ తర్వాతే కొడుకుని చూడడానికి తల్లిదండ్రులు వచ్చారు. అయితే కొడుకు పోయిన తర్వాత అయినా కోడల్ని ఆదరిస్తారని అందరూ అనుకున్నారు.. కానీ ఆ కుటుంబం మాత్రం అలేఖ్య రెడ్డిని దూరం పెట్టింది. ప్రముఖ వైసిపి నేత విజయసాయిరెడ్డి దగ్గర బంధువు కావడంతో ఆయనే వీరికి అండగా ఉన్నట్లు సమాచారం.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">