BigTV English

OG Movie: ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ వస్తున్నాడు.. సౌండ్ బద్దలవ్వాల్సిందే

OG Movie: ఒరిజినల్ గ్యాంగ్ స్టార్  వస్తున్నాడు.. సౌండ్ బద్దలవ్వాల్సిందే

OG Movie: పవన్ కళ్యాణ్ .. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకోనున్న విషయం తెల్సిందే. పదేళ్ల క్రితం జనసేన స్థాపించినప్పుడు పవన్.. ప్రజాసేవకే తన జీవితం అంకితం అని చెప్పుకొచ్చారు. ఇక మధ్యలో పార్టీ ఫండ్ కోసం సినిమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు జనసేన అన్ని స్థానాల్లో గెలిచి.. పవన్ ను డిప్యూటీ సీఎం ను చేసింది. ఇప్పుడు పవన్ కు సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఆయన ఫినిష్ చేయని మూవీస్ ను ఫినిష్ చేసి.. సినిమాలకు స్వస్తి చెప్పనున్నారని టాక్.


ఇక ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాలు మూడు. అందులో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాను పవన్ చాలా త్వరగా ఫినిష్ చేయాలనీ చూసాడు. దాదాపు సగానికి పైగా షూటింగ్ కూడా ఫినిష్ అయ్యింది. మిగతాది త్వరలోనే పూర్తిచేయనున్నాడు. మొదట ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ తెలిపారు. అయితే ఇప్పుడు OG వాయిదా పడిందని తెలుస్తోంది. తాజాగా OG నుంచి మొదటి సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.


మ్యూజిక్ డైరెక్టర్ థమన్  .. సౌండ్ బాక్స్ ఫోటోను షేర్ చేస్తూ OG బ్లాస్ట్ చేయడానికి వస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీంతో త్వరలోనే మొదటి సింగిల్ రానుందని తెలుస్తోంది. మరి ఆ సింగిల్ ఎలాంటిదో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.ఈ సినిమాతో సుజీత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×