Jabardasth Naresh : సినీ ఇండస్ట్రీలో ఉన్న వారంతా గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు.. తెర ముందు అద్భుతంగా నటించేవారి నిజ జీవితాల్లో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఇటీవల చాలా నటీనటులు తమ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ అందరిని ఏడ్పించేసారు. అందరిని నవ్విస్తున్న వారి జీవితం కష్టాలమాయం. కొందరు వరుస సినిమాల్లో నటిస్తూ బాగానే ఉన్నా కూడా జీవితంలో విషాదాలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ నరేష్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చెప్పి అందరిని కన్నీళ్లు పెట్టుకొనేలా చేసాడు. అతని జీవితంలో గుండెను ముక్కలు చేసిన ఒక ఘటనను అభిమానులతో పంచుకున్నాడు. అది విన్న ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
తెలుగు బుల్లితెర పై టాప్ కామెడీ షో జబర్దస్త్.. ఈ షోకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో చెప్పనక్కర్లేదు. ఈ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చింది. అయితే జబర్దస్త్ కమెడియన్స్ లలో ఒక్కొక్కరిది ఒక్కో కథ.. ఈ షోలో తమ జీవితాలను గుర్తు చేసే స్టోరీలతో స్కిట్ లను చేస్తూ అందరిని కడుపుబ్బా నవ్విస్తున్నారు. జబర్దస్త్ నరేష్ గురించి పరిచయం అవసరం లేదు. తన హైట్ తనకు ఎంతో మేలు చేసిందని చెబుతుంటాడు. తన లోపాన్ని తానే అధిగమించుకుని ఈ స్థాయికి వచ్చానని అంటాడు.. ఇటీవల శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఓ స్కిట్ చేసాడు. అతడి డ్యాన్స్ కి ఒక అందమైన అమ్మాయి ఇంప్రెస్ అవుతుంది. దీనితో ఇద్దరూ ప్రేమలో పడతారు. నరేష్ ఆ అమ్మాయితో రొమాంటిక్ గా డ్యాన్స్ చేస్తాడు. ఒక రోజు ఆ అమ్మాయి తన అసలైన బాయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా మాట్లాడడం నరేష్ గమనిస్తాడు. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో పొట్టోడుకు బాగా పేరుంది. వాడికి ఈవెంట్స్ వస్తున్నాయి. వాడిని శాంతం ఊడ్చేసీ వదిలేద్దాం అని అంటుంది. తనని ప్రేమ పేరుతో మోసం చేయడమే కాక తన లోపాన్ని హేళన చేయడంతో నరేష్ గుండె పగిలిపోతుంది. తన బాధ వర్ణనాతీతం..
తనను మొదట ఇష్టపడ్డానని చెప్పి మరి నమ్మించింది.. నాతో ఎంతో ఖర్చు పెట్టింది. అయిన నేను ఏనాడు తనని తప్పుగా తాకలేదు. కానీ తన మనసులో నామీద ఇంత ఉందా అని గుండెలు పగిలేలా ఏడుస్తాడు. అతని ఏడ్పు విని అక్కడ ఉన్నవాళ్లంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ షోకి జడ్జ్ గా వచ్చిన హీరోయిన్ సదా కన్నీళ్లు పెట్టుకుంది. స్కిట్ పూర్తయ్యాక మీరు చాలా సహజంగా నటించారు అంటూ నరేష్ ని సదా ప్రశంసిస్తుంది. మీ లైఫ్ లో ఇలాంటిది నిజంగా జరిగిందా అని అడుగుతుంది. అప్పుడు నరేష్ అవును మేడం అని బదులిస్తాడు. సో నరేష్ తన రియల్ లైఫ్ స్టోరీనే స్కిట్ గా పెర్ఫామ్ చేసి చూపించాడు.. నరేష్ బ్రేకప్ స్టోరీని ఇలా అందరికి తెలిసేలా చేసాడు. నరేష్ తన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పి అందరినీ ఏడిపించేశాడు. నరేష్ విరహ వేదన.. ఆ పర్ఫామెన్స్ చూసి అందరూ ఏడ్చేశారు. ఏ షోకు నరేష్ వచ్చిన పంచులతో పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు. అలాంటి వ్యక్తి వెనుక గుండెలు పగిలే బ్రేకప్ స్టోరీ ఉందని తెలుసుకున్న ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.