Congress govt Good News: మీకు భూమి లేదా.. సాగు భూమి లేకపోవడంతో ఎటువంటి ఆధారం లేక ఇబ్బందుల్లో ఉన్నారా.. మీకోసమే తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అది కూడా ఎప్పుడో కాదు.. అతి త్వరలోనే. అసలు ఇంతకు ఆ స్కీమ్ ఏమిటి? ఎలా లబ్ది చేకూరుతుందో తెలుసుకుందాం.
మా పాలన మాటల్లో కాదు. చేతల్లో చూపిస్తాం అంటోంది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. కల్లిబొల్లి మాటలతో కాలయాపన చేసే ప్రభుత్వం కాదిది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ప్రభుత్వమిది. ఇప్పటికైనా తెలుసుకోండి. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్, అవాస్తవాలు కాదు. నేరుగా మా లబ్దిదారులను అడగండంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాక, ఇవ్వని హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తగా మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భూమి లేని పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అది కూడా డిసెంబర్ 28 న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు కాబట్టి కొత్త పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అదే రోజు తొలివిడత నగదును కూడా జమ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Venu Swamy prediction: జైలుకు వెళ్తే చాలు.. సీఎం అవుతారట.. మీరూ ట్రై చేస్తున్నారా!
ఏంటా కొత్త స్కీమ్..
రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూమి లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారిలో ఎందరో వలస వెళ్లి జీవనం సాగిస్తుంటే, మరికొందరు కూలీనాలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారికి ఈ కొత్త స్కీమ్ వరమని చెప్పవచ్చు. ఏడాదికి వీరికి ప్రభుత్వం రూ. 12 వేలు అందజేయనుంది. ఈ నెల 28న తొలివిడతగా లబ్దిదారులకు రూ. 6 వేలు ఇచ్చేందుకు కూడా రేవంత్ సర్కార్ సిద్దమైంది.
సంక్రాంతికి రైతు భరోసా ఖాయం..
సంక్రాంతికి రైతులందరికీ రైతు భరోసా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి పలు పథకాలను ప్రవేశపెట్టి రూ. 50953 కోట్ల ఖర్చును ప్రభుత్వం చేసిందని డిప్యూటీ సీఎం అన్నారు. అంటే రైతు భరోసా అమలైతే ఇంకా అదనపు భారం రైతులపై పడనుంది. కానీ రైతు సంక్షేమానికి ఏమాత్రం వెనక్కు తగ్గేదేలేదని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల రైతు విజయోత్సవ సభలో ప్రకటించారు. మొత్తం మీద సంక్రాంతికి ముందు కొత్త పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దం కాగా, సంక్రాంతికి రైతు బంధు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడంపై ప్రజలు, రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.