Unstoppable with Allu Arjun : కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన గంగోత్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కానీ అల్లు అర్జున్ కు మాత్రం సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో సుకుమార్ దర్శకుడుగా పరిచయమైన ఆర్య సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అప్పట్లో ఆర్య సినిమా ఒక సంచలనం. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు విపరీతమైన పేరు వచ్చింది. అలానే దర్శకుడు సుకుమార్ కి కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఒక ప్రేమ కథను ఇలా కూడా చెప్పొచ్చు అని ఒక కొత్త పంథాను క్రియేట్ చేశాడు సుక్కు. అక్కడితో వీరిద్దరి మధ్య స్నేహం కూడా బాగా చిగురించింది. ఇన్ని కాంబినేషన్స్ ఉన్నా కూడా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఇద్దరికీ గుర్తింపు లభించింది. ఇక ప్రస్తుతం పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ లో జోరు పెంచింది. దీనిలో భాగంగా అల్లు అర్జున్ బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి హాజరయ్యారు. ఈ షో లో చాలా విషయాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దీనిని కొంతమంది మరో కోణంలో కూడా చూడటం మొదలుపెట్టారు. సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి అందర్నీ ఒకసారి కవర్ చేయడానికి ఈ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : Robinhood Teaser: రాబిన్ హుడ్.. వాడికి పర్టిక్యులర్ జెండా, ఎజెండా ఏది ఉండదు
మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలి కి మధ్య వివాదాలు ఎప్పటినుంచో వస్తున్న సంగతి తెలిసిందే. వీటి గురించి ఎవరు పెద్దగా స్పందించలేదు. అంతా సజావుగానే సాగుతుంది అని ఇరువర్గాలు అక్కడక్కడ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో లో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోల గురించి మాట్లాడనున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారాల్లో అందరి హీరోల అభిమానులను ఎలా అయితే కలుపుకున్నాడో, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ద్వారా చాలామంది అభిమానులను కలుపుకుంటే పుష్ప సినిమాకు మంచి ప్లస్ అవుతుంది అని అల్లు అర్జున్ ప్లాన్ చేశాడు అంటూ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఆ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత చాలా విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.